viral video: పిల్లలకోసం కొండచిలువతో పక్షి పోరాటం.. చివరికి ఎం జరిగిందంటే..?
సృష్టిలో అమ్మప్రేమకు వెలకట్టలేనిది. తన బిడ్డల కోసం తల్లి పడే తపన త్యాగం ఈ ప్రపంచంలో మరెవరూ చేయరు చేయలేరు. ఇది కేవలం మనుషుల్లో మాత్రమే కాదు, పశుపక్ష్యాదులకూ వర్తిస్తుంది. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ బాతు తన పిల్లలతో కలిసి ఒక గొయ్యిలో సేదతీరుతోంది. ఇంతలో అక్కడికి ఒక పెద్ద కొండచిలువ వచ్చి వాటిపై దాడి చేసింది. ప్రమాదాన్ని గ్రహించిన తల్లిబాతు ఎలాగైనా తన పిల్లలను కాపాడుకోవాలనుకుంది. వెంటనే తన పిల్లలను అలర్ట్ చేసి వాటన్నిటని గోతిలోనుంచి పైకి పంపించేసింది. తాను మాత్రం కొండచిలువనుంచి తప్పించుకోలేకపోయింది. అప్పటికే కొండచిలువ ఆ గొయ్యిలోకి చేరుకుని బాతుని చుట్టేసింది. పిల్లలను రక్షించుకుని తాను మాత్రం కొండచిలువకు ఆహారంగా మారిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన ప్రజలు భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ వీడియో ఓ యూజర్ తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను 17 వేల మందికి పైగా వీక్షించగా వందలాది మంది లైక్ చేశారు. బాతు తన పిల్లల్ని రక్షించడానికి తనకి తాను బలి అయిందని కొందరు అంటే.. కన్నీళ్లు తెప్పించిన ఈ దృశ్యం మనసుకు హత్తుకునేలా ఉందని కొందరు అంటున్నారు. ఇది కదా అమ్మ ప్రేమ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..