Viral Video: విమానం ఇంజిన్‌లో పడి వ్యక్తి దుర్మరణం.. ఎయిర్‌పోర్టులో టెంక్షన్.
విమానం ఇంజిన్‌లో పడి ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ దారుణ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. టెక్సాస్‌లోని శాన్ యాంటోనియో విమానాశ్రయంలో జూన్ 23న ఈ ఘటన జరిగింది. నేషనల్ ట్రాన్స్‌పోర్టు సేఫ్టీ బోర్డు వివరాల ప్రకారం.. లాస్ యాంజిలిస్..
విమానం ఇంజిన్‌లో పడి ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ దారుణ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. టెక్సాస్‌లోని శాన్ యాంటోనియో విమానాశ్రయంలో జూన్ 23న ఈ ఘటన జరిగింది. నేషనల్ ట్రాన్స్‌పోర్టు సేఫ్టీ బోర్డు వివరాల ప్రకారం.. లాస్ యాంజిలిస్ నుంచి వచ్చిన డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం అరైవల్ గేటు వద్దకు చేరుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అప్పటికి విమానంలోని ఒక ఇంజిన్ ఆన్‌లోనే ఉంది. దాంతో ఇంజిన్, గాలితోపాటూ వర్కర్‌ను కూడా లోపలికి లాగేసుకుంది. దీంతో, అతడు అక్కడికక్కడే మరణించాడు. కాగా, ఈ ఘటనపై డెల్టా ఎయిర్‌లైన్స్ విచారం వ్యక్తం చేసింది. దారుణ ఘటనతో తమ గుండె పగిలిందని వ్యాఖ్యానించింది.
ఘటనపై ఎన్‌టీఎస్‌బీ దర్యాప్తు చేపట్టింది. కాగా మృతుడు యూనిఫీ అనే సంస్థలో పనిచేసేవాడు. ఈ సంస్థ విమానాశ్రయంలో గ్రౌండ్ హ్యాండ్లింగ్‌కు సంబంధించిన బాధ్యతలు నిర్వహిస్తోంది. అయితే, ఈ ప్రమాదంలో యూనిఫీ సంస్థకు ఎటువంటి సంబంధం లేదని నేషనల్ సేఫ్టీ ట్రాన్స్‌పోర్టు బోర్డు తేల్చింది. ఘటన జరిగిన సమయంలో భద్రతాపరమైన నిబంధనల ఉల్లంఘన జరగలేదని పేర్కొంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో

