రోజుకు 2 స్ట్రాబెర్రీలు తింటే ఎన్ని లాభాలో తెలుసా..? ముఖ్యంగా ఆ సమస్యలన్నింటికీ చెక్‌..

ఈ పండులో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అనేక వ్యాధులతో పోరాడుతుంది. స్ట్రాబెర్రీ పండ్లలోని విటమిన్లు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. ఇందులోని పీచు పదార్థం శరీరంలోని కొవ్వును కరిగించి బరువును అదుపులో ఉంచడంలో ఉపయోగపడుతుంది.

రోజుకు 2 స్ట్రాబెర్రీలు తింటే ఎన్ని లాభాలో తెలుసా..? ముఖ్యంగా ఆ సమస్యలన్నింటికీ చెక్‌..
Strawberry
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 30, 2023 | 8:47 PM

స్ట్రాబెర్రీ ధర కొంచెం ఖరీదైనది. కానీ, దాని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. స్ట్రాబెర్రీలో విటమిన్ సి, ఫైబర్ కంటెంట్, కేలరీలు, ఫైబర్, పొటాషియం, ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. అలాగే ఇది అన్ని కాలాల్లోనూ సమృద్ధిగా లభించే పండు. సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది. వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా నిరోధిస్తుంది. ఎక్కువ కాలం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. స్ట్రాబెర్రీ లో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. దీంతో మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా హాయిగా తినొచ్చు. స్ట్రాబెర్రీస్‌తో ఆల్జీమర్స్, మతిమరుపు వంటివి రాకుండా అడ్డుకుంటుంది. జ్ఞాపక శక్తి పెరగటానికి దోహదం చేస్తుంది.

ఈ పండులో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అనేక వ్యాధులతో పోరాడుతుంది. స్ట్రాబెర్రీ పండ్లలోని విటమిన్లు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. ఇందులోని పీచు పదార్థం శరీరంలోని కొవ్వును కరిగించి బరువును అదుపులో ఉంచడంలో ఉపయోగపడుతుంది.

స్ట్రాబెర్రీలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటు, గుండె ఆరోగ్యం, స్ట్రోక్‌లను నివారిస్తుంది. గర్భిణీ స్త్రీలకు కూడా ఇది ఉత్తమమైన పండు. స్ట్రాబెర్రీ జ్యూస్ చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి అనువైనది. ఇది నల్లటి వలయాలు, మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..