AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tomato: కుళ్లిపోయిన టమాటోలను చెత్తబుట్టలో పడేస్తున్నారా.. ఇలా వాటిని ఉపయోగిస్తే..

Damaged Tomato Uses: చెడిపోయిన, కుళ్లిపోయిన టమాటోలను చెత్త కుండీ పడేయకండి. ఎందుకంటే వాటితో చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు.

Tomato: కుళ్లిపోయిన టమాటోలను చెత్తబుట్టలో పడేస్తున్నారా.. ఇలా వాటిని ఉపయోగిస్తే..
Tomato
Sanjay Kasula
|

Updated on: Jun 30, 2023 | 7:10 PM

Share

ఇంట్లోకాని హోటల్స్‌లో చాలా కాలం పాత్రలను ఉపయోగించడం వల్ల కొంత మురికి, జిడ్డు పట్టుకుని ఉంటాయి. ఇందులో వివిధ రకాల డిటర్జెంట్లను ఉపయోగిస్తుంటాం. అయితే వాటితో ఎలాంటి ఫలితం ఉండదు. అవి రాగి , స్టీల్ పాత్రలను క్లీన్ చేయడానికి చింతపండును ఉపయోగిస్తాం. చింతపండుకు బదులుగా మనం ఇంట్లో చెడిపోయిన టమోటాలను ఉపయోగించవచ్చు. అంటే కుళ్లిపోయిన టమాటోలను ఇందుకు ఉపయోగించవచ్చు. అది ఎలానో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం..

  1. వంట పాత్రలను క్లీన్ చేసేందుకు: మనం ఇంట్లో వంట చేస్తున్నప్పడు ఇత్తడి, రాగి, స్టీల్ పాత్రలపై జిడ్డు పేరుకుపోయి వాటి అసలు మెరుపు తగ్గిపోతుంది. ఇలాంటి సమయంలో చెడిపోయిన టమాటోలను ఇక్కడ ఉపయోగించండండి. దీంతో పాత్రలపై బాగా రుద్దండి. దీంతో ఆ పాత్రలకు మెరుపు వస్తుంది.
  2. సిల్వర్ నగలకు మెరుపు కోసం: మహిళలు ధరించే పట్టగొలుసులు, వెండి రింగులు, వెండి గ్లాసులు కొంత కాలం తర్వాత మెరుపు తగ్గిపోతుంది. ఈ సమయంలో వాటిని టమాటోలతో రుద్దితే.. అవి మెరుస్తుంటాయి. ఒకవేళ వాటికి జిడ్డు గనక ఎక్కువగా ఉంటే.. కొద్దిగా మజ్జిగతో టమాటోలను కలిపి రుద్ది కడిగితే జిడ్డు తొలగిపోతుంది.. ఈ చిట్కాలు పాటించి అవి మిలమిల మెరిసేలా తయారు చేయవచ్చు..
  3. కూరగాయలు కట్ చేసే కత్తులకు పదును పెంచేందుకు కుళ్లిపోయిన టమాటోలను ఉపయోగించవచ్చు. దీంతో కత్తులకు పదును వస్తాయి.
  4. మనం చాయ్ తాగేందుకు ఉపయోగించే పింగాణి చాయ్ కప్‌, ఇంట్లో పచ్చడి నిల్వ చేసేందుకు ఉపయోగించే పింగాణి పాత్రలు.. అంటే జాడీలను మిలమిల మెరవాలంటే మొదటగా బూడిదతో క్లీన్ చేసి ఆతర్వాత చెడిపోయిన టమాటోలతో మరోసారి కడగండి. ఆ తర్వాత మంచి నీటితో కడగాలి ఇలా చేస్తే ఆ పాత్రలు క్లీన్‌గా మెరుస్తాయి. ఇందులో కొంత బేకింగ్ సోడా కలిపిస్తే మరింత మెపురు వస్తాయి. కప్పులో టీ, కాఫీ మరకలు ఉన్నట్లయితే టమాటోలతో రుద్దడం మంచిది.
  5. చెడిపోయిన, కుళ్లిపోయిన టమాటోలను చెత్త బుట్టలో పడేకుండా వాటిని ఓ పాత్రలోకి తీసుకుని అందులో కొంత నీటిని పోయండి. నీటిని పోసిన తర్వాత నెమ్మదిగా వాటి నుంచి విత్తనాలను వేరు చేయండి. అలా చేయడం వల్ల ఆ విత్తనాలు వస్తాయి. ఆ విత్తనాలను మనం మన ఇంట్లోని కుండీలలో వేస్తే వారం తిరిగేంతలో మొలకలు వస్తాయి. ఆ మొలకలను తిసి వేరు వేరుగా నాటుకుంటే.. ధర పెరిగినప్పుడు మన ఇంట్లోనే టమాటోలు వస్తాయి.

మరిన్ని హ్యూమన్ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం