భోజనం చేసేటప్పుడు ఈ దిక్కుకు అభిముఖంగా కూర్చుంటే అప్పులు పెరుగుతాయ్.. ఈ తప్పు అస్సలు చేయకండి..
మీరు తూర్పు లేదా ఉత్తరం వైపు చూస్తూ భోజనం చేయటం వల్ల భగవంతుని అనుగ్రహం మీపై ఉంటుందని, ఆయుర్దాయం పెరుగుతుందని చెబుతారు. అలాగే, వాస్తు ప్రకారం.. డైనింగ్ టేబుల్‌ని దక్షిణ లేదా పడమర గోడ వైపు వేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అక్కడ కూర్చొని తినడం వల్ల.. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఇంటి వాస్తు సరిగ్గా ఉంటేనే మనసు సరిగ్గా ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. వాస్తు సరిగ్గా ఉంటే ప్రతి రంగంలో విజయం సాధించడంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. వాస్తు శాస్త్రంలో దిశ చాలా ముఖ్యమైనది. వాస్తు శాస్త్ర నియమాలను సక్రమంగా పాటించడం వల్ల జీవితంలో అనేక సానుకూల మార్పులు వస్తాయి. ఇంట్లో ఎక్కడైనా కూర్చొని భోజనం చేయడం వల్ల కూడా వాస్తు దోషం కలుగుతుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ఒక వ్యక్తి భోజనం చేసేటప్పుడు ఏ దిశను చూస్తూ కూర్చొవాలి, ఏ దిశను చూడకూడదు. అనేది కూడా ముఖ్యమే. భోజనం చేసేటప్పుడు సరైన దిశలో కూర్చుంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు తప్పు దిశలో కూర్చుంటే అది మరింత దిగజారుతుంది.
వాస్తు శాస్త్రంలో దిశ చాలా ముఖ్యమైనది. వాస్తు శాస్త్ర నియమాలను సక్రమంగా పాటించడం వల్ల జీవితంలో అనేక సానుకూల మార్పులు వస్తాయి. ఇంట్లో ఎక్కడైనా కూర్చొని భోజనం చేయడం వల్ల వాస్తు దోషం కూడా కలుగుతుంది… దీనికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..
వాస్తు ప్రకారం తూర్పుదిక్కున, ఉత్తర దిక్కులలో కూర్చుని భోజనం చేయడం ఉత్తమమని భావిస్తారు. ఈ రెండు దిక్కులు దేవుడి నిలయంగా చెబుతారు. మీరు తూర్పు లేదా ఉత్తరం వైపు చూస్తూ భోజనం చేయటం వల్ల భగవంతుని అనుగ్రహం మీపై ఉంటుందని, ఆయుర్దాయం పెరుగుతుందని చెబుతారు. అలాగే, వాస్తు ప్రకారం.. డైనింగ్ టేబుల్‌ని దక్షిణ లేదా పడమర గోడ వైపు వేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అక్కడ కూర్చొని తినడం వల్ల.. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం, దక్షిణ దిక్కును చూస్తూ తినడం అశుభ ఫలితాలను ఇస్తుంది. దక్షిణ దిశను యమ దిక్కుగా పరిగణిస్తారు. అందుకే ఈ దిక్కుకు ఎదురుగా తినడం వల్ల ఆయుష్షు తగ్గి దురదృష్టం పెరుగుతుంది. వాస్తు ప్రకారం, పశ్చిమ దిక్కు ఆహారానికి తగినది కాదు. పశ్చిమాభిముఖంగా కూర్చుని ఆహారాన్ని తినడం వల్ల వ్యక్తిపై అప్పులు పెరుగుతాయి. మీరు ఈ దిశను వదిలేస్తే మీరు అప్పుల నుండి బయటపడతారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..