Kerosene Stove Pin: ఇదేమిటో మీలో ఎంతమందికి తెలుసు..? బాల్యం గుర్తుకొచ్చింది కదూ..!
వినియోగదారులందరూ కామెంట్ల రూపంలో అదేంటో చెప్పారు. కొంతమంది వినియోగదారులు ఫోటో చూసిన తర్వాత 90 ల కాలాన్ని గుర్తుకు తెచ్చుకోగా, మరికొంత మంది వినియోగదారులకు కిరోసిన్ నూనె వాసన గుర్తుకు వచ్చింది. నిజానికి ఆ కాలంలో ఇళ్ల నుంచి టీ స్టాళ్ల వరకు స్టవ్‌లు వాడేవారు.

సోషల్ మీడియాలో పాత ఫోటో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. ఫోటోతో పాటుగా వారు క్యాప్షన్‌లో ఇదేంటో ఎంతమందికి తెలుసు??? అనే ప్రశ్నవేశారు. ఇక ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ ట్వీట్‌కి 1 మిలియన్‌కు పైగా వీక్షణలు,వేల సంఖ్యలో లైక్‌లు వచ్చాయి. ఫోటో చూసిన ప్రతి ఒక్కరూ స్పందించారు. 90వ దశకంలో ఉన్నవారు ఈ ఫోటోను చూసి తమ చిన్ననాటి జ్ఞాపకాల్లో మునిగిపోయారు. కొందరి చేతుల్లోంచి కిరోసిన్ ఆయిల్ వాసన రావడం కూడా మొదలయ్యింది! అవును, మీరు కూడా ఈ చిత్రాన్ని జాగ్రత్తగా చూడండి.. మీరూ ఖచ్చితంగా ఈ వస్తువును ఉపయోగించే ఉంటారు. అయితే, ఇంతకీ దీనిని ఏమని పిలుస్తారో చెప్పగలరా?
అయితే, ఫోటోలో కనిపించిన వస్తువు స్టౌ పిన్.. అని మనందరికీ తెలుసు.. కానీ, దాని పేరు ప్రిమస్ పిన్. ఈ పిన్‌ను 90వ దశకం వరకు అందరి ఇళ్లలోనూ ఉండేది. దీనిని కిరోసిన్ స్టవ్‌ను శుభ్రపరిచేందుకు వినియోగించేవారు. స్టవ్ బర్నర్ మూసుకుపోయినప్పుడు ఈ పిన్‌సాయంతో స్టవ్ బర్నర్‌ను శుభ్రం చేసేవారు. ఫలితంగా స్టవ్ పూర్తి ఫ్లేమ్‌తో మండేది. దీనిని ఉపయోగించిన తర్వాత స్టవ్‌లో ఇరుక్కున్న నూనె బర్నర్ దగ్గర నుండి రాకెట్ లాగా బయటకు వచ్చి స్టవ్ సాఫీగా మండేది. దాంతో ప్రజల అవసరం కోసం ఈ పిన్ ప్రతీ కిరాణా దుకాణంలో దొరికేది.




ఈ చిత్రాన్ని జనవరి 26న ట్విట్టర్ హ్యాండిల్ @HasnaZarooriHai పోస్ట్ చేసారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రంతో పాటు అతను ఓ ప్రశ్న కూడా వేశారు.. ఇది ఏమిటో మీలో ఎంతమందికి తెలుసు??? ఇప్పటి వరకు ఈ ట్వీట్‌కి 1 మిలియన్‌కు పైగా వీక్షణలు, 3500 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి.
How many of you know what this is ????? pic.twitter.com/9bzsy15kU5
— Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) June 26, 2023
వినియోగదారులందరూ కామెంట్ల రూపంలో అదేంటో చెప్పారు. కొంతమంది వినియోగదారులు ఫోటో చూసిన తర్వాత 90 ల కాలాన్ని గుర్తుకు తెచ్చుకోగా, మరికొంత మంది వినియోగదారులకు కిరోసిన్ నూనె వాసన గుర్తుకు వచ్చింది. నిజానికి ఆ కాలంలో ఇళ్ల నుంచి టీ స్టాళ్ల వరకు స్టవ్‌లు వాడేవారు. అవును, ఈ స్టవ్‌లు గ్యాస్‌తో కాకుండా కిరోసిన్ ఆయిల్‌తో నడిచేవి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




