Kadapa Steel Plant: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు..
కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు వచ్చాయి. కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం అనుమతుల మేరకు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి..

కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు వచ్చాయి. కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం అనుమతుల మేరకు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి నుంచి కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. 3591 ఎకరాల్లో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం అవుతుంది. ఏడాదికి మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటవుతుంది. దీని కోసం రూ. 16,986 కోట్ల పెట్టుబడులు అవసరమని అంచనా.
ఇదిలావుంటే.. ఏపీలోని కడప స్టీల్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులను ఈ ఏడాది మార్చి నెలలోనే మంజూరు చేసింది కేంద్రం. దీనిపై డిసెంబర్ 20న కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది ఏపీ సర్కార్. దీంతో మార్చి 9న అనుమతులు మంజూరు చేసింది.
కడప స్టీల్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులు లభించడంతో దేశంలోనే అత్యంత తక్కువ సమయంలో పర్యావరణ అనుమతులు పొందిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది. కేంద్ర పర్యావరణశాఖ, అటవీశాఖ, క్లైమెట్ చేంజ్ మంత్రిత్వశాఖల నుంచి అనుమతులు లభించాయి. ఏపీ సర్కార్ పంపిన ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించి పర్మిషన్ ఇస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది.
కడప జిల్లా సున్నపురాళ్లపల్లె, పెద్దనందులూరు గ్రామాల్లో స్టీల్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది ఏపీ హై గ్రేడ్ స్టిల్స్ లిమిటెడ్. తొలి దశలో ఏడాదికి 3 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి, 84.7 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగనుంది. మరోవైపు ప్రాజెక్ట్‌లో భాగంగా 33 శాతం.. 484.4 హెక్టార్లలో గ్రీన్‌బెల్ట్‌ను అభివృద్ధి చేయనున్నారు.
పరిశ్రమ కోసం భూమిపూజ..
2007 జూన్ 10న నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కడప ఉక్కు పరిశ్రమ కోసం భూమిపూజ చేశారు. 20 మిలియన్ టన్నుల సామర్థ్యంతో బ్రహ్మణి ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో ఈ పరిశ్రమ ప్రారంభానికి అంబవరం గ్రామ సమీపంలో పునాదిరాయి వేశారు వైఎస్సార్. 20వేల కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమను నిర్మిస్తామని ప్రకటించారు రాజశేఖర్‌రెడ్డి. విశాఖ ఉక్కు పరిశ్రమ 29వేల ఎకరాల్లో నిర్మిస్తే, బ్రహ్మణి స్టీల్‌ని 10 వేల ఎకరాల్లో అదే సామర్థ్యంతో నిర్మిస్తామని వెల్లడించారు దివంగత నేత. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మిస్తామని చెప్పిన ప్రాంతంలో కాకుండా.. మరో ప్రాంతంలో శంకుస్థాపన చేశారు చంద్రబాబు. ఇది 2018లో జరిగింది. గండికోట రిజర్వాయర్ ఎగువన ఉన్న కంబాలదిన్నెను ఎంచుకున్నారు అప్పటి ముఖ్యమంత్రి. వై.ఎస్, చంద్రబాబు తర్వాత మూడోసారి 2019 డిసెంబర్ 23న స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు జగన్.
ఇవి కూడా చదవండి: Chat Without Internet : ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్ చాట్ చేయండి.. ఎలానో తెలుసా..
