Ox Died: గ్రామాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టిన ఎద్దు మరణం.. రాత్రంతా జాగరం ఉంటూ..
Ox Died: మనిషి చనిపోతేనే పెద్దగా చలించని ఈరోజుల్లో విశాఖలోని రుషికొండలో ఓ ఎద్దు మరణం ఆ గ్రామాన్ని తీవ్రంగా కలిచివేసింది.
Ox Died: మనిషి చనిపోతేనే పెద్దగా చలించని ఈరోజుల్లో విశాఖలోని రుషికొండలో ఓ ఎద్దు మరణం ఆ గ్రామాన్ని తీవ్రంగా కలిచివేసింది. ఆ ఎద్దుకోసం ఊరు ఊరంతా కన్నీరుమున్నీరైంది. రాత్రంతా ఆ ఎత్తు వద్దే జాగారం ఉంటూ.. భజనలు, ప్రార్థనలు చేశారు. మరునాడు భక్తిశ్రద్ధలతో గ్రామస్తులంతా కలిసి అంత్యక్రియలు నిర్వహించారు.
వివరాల్లోకెళితే.. విశాఖ రుషికొండలోని ఒమ్మి వాని పాలెంలో వృద్ధాప్యంతో కాలం చెల్లిన ఓ ఎందుకు గ్రామస్తులంతా ఘనంగా పానుపు కార్యక్రమం (అంత్యక్రియలు) నిర్వహించారు. గ్రామంలోని ఒమ్మి గడ్డెన్న కుటుంబాని చెందిన ఈ ఎద్దును సింహాద్రి అప్పన్న స్వామి స్వరూపంగా తౌడు పెద్దు పేరుతో ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. రుషికొండ, ఒమ్మి వాని పాలెం తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దీన్ని కొలుస్తూ వుంటారు. యాదవ కులానికి చెందిన గడ్డెన్న కులదైవం సింహాద్రి అప్పన్న స్వామి కి చెందినదిగా ఈ తౌడు పెద్దు ను కొలుస్తూ సాము గరిఢీ లతో వివిధ కార్యక్రమాలకు తీసుకుని వెళుతుంటారు. అయితే సోమవారం ఇంటివద్ద నిలుచుని ఉన్న ఎద్దు ఒక్కసారిగా కుప్పకూలి ఆ భగవంతునిలో ఐక్యమైపోయింది.
అది చూసి గ్రామ ప్రజలు ఎంతగానో రోధించారు. సోమవారం రాత్రి ప్రజలంతా జాగారం ఉండి సాముగరిఢీలు, భజనలు నిర్వహించారు. మరునాడు ఉదయం తౌడు పెద్దు కు విశేష పూజలు చేశారు. మూడు ప్రాంతాలకు చెందిన గరిఢీ వారు కూడా వచ్చి ఇక్కడ గరిఢీ నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు. పూజల అనంతరం తౌడు పెద్దు కు అంత్యక్రియలు నిర్వహించారు. ఇన్నేళ్లుగా సింహాద్రి అప్పన్న దైవ స్వరూపంగా భావించే తౌడు పెద్దు.. శుభకార్యక్రమాల్లో గరిఢీలతో వివిధ ప్రాంతాలకు వెళ్లి దీవెనలు అందించేది. గడ్డన్న కుటుంబానికి, గ్రామానికి ఎంతో కీర్తి ని తెచ్చిన తౌడు పెద్దు కాలం చెల్లట౦తో అంతా కన్నీరుమున్నీరుగా విలపించారు. తౌడు పెద్దు ఆత్మ కు శాంతి చేకూరి ఆ సింహాద్రి అప్పన్న లో లేదా పరమేశ్వరుడు లో కలిసి పోవాలని ప్రార్థించారు జనాలు. ఈ తౌడు పెద్దు పానుపు పూజా కార్యక్రమాల్లో స్థానిక గ్రామ ప్రజలు సాము గరిఢీ దాసుళ్ళ వారు పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు.
Also read:
Azim Premji: మనసున్న మారాజులు వీరే.. ప్రతిరోజు రూ. 27 కోట్లు విరాళం.. టాప్ ఎవరో తెలుసా..
David Warner: ఐపీఎల్ 2022 వేలంలో నా పేరు ఉండబోతుంది.. డేవిడ్ వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు..