AP News: ఆ ఓట్లు కూడా చెల్లుతాయన్న ఈసీ.. అభ్యర్థుల్లో మొదలైన టెన్షన్.. ఎందుకంటే..

ఆంధ్రప్రదేశ్‎లో ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతూ ఉండటంతో పోస్టల్ బ్యాలెట్‎పై అందరి కళ్ళు పడ్డాయి. దేశంలోనే అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్ నమోదైన రాష్ట్రంగా ఏపీ రికార్డ్ సాధించింది. ఈసారి ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరగడంతో పోస్టల్ బ్యాలెట్ ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్ని స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించడంలో పోస్టల్ బ్యాలెట్‎లు కీలక పాత్ర వహించనుంది.

AP News: ఆ ఓట్లు కూడా చెల్లుతాయన్న ఈసీ.. అభ్యర్థుల్లో మొదలైన టెన్షన్.. ఎందుకంటే..
Postal Ballot
Follow us

| Edited By: Srikar T

Updated on: May 26, 2024 | 7:29 PM

ఆంధ్రప్రదేశ్‎లో ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతూ ఉండటంతో పోస్టల్ బ్యాలెట్‎పై అందరి కళ్ళు పడ్డాయి. దేశంలోనే అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్ నమోదైన రాష్ట్రంగా ఏపీ రికార్డ్ సాధించింది. ఈసారి ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరగడంతో పోస్టల్ బ్యాలెట్ ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్ని స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించడంలో పోస్టల్ బ్యాలెట్‎లు కీలక పాత్ర వహించనుంది. అందుకే ప్రతి ఓటును కీలకంగా తీసుకుంటున్నాయి ప్రధాన పార్టీలు. పోస్టల్ బ్యాలెట్‎లలో వేరు వేరు కారణాలతో చెల్లనివిగా పరిగణించకూడదు అంటూ ఎన్నికల కమిషన్‎కు వినతి పత్రాలు అందజేసాయి. సుమారు 5 లక్షల 40 వేల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 2000 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోల్ అయ్యాయి. అంత మొత్తంలో నమోదైన ఓట్లు తప్పనిసరిగా ఫలితాలపై ప్రభావం చూపించనున్నాయి.

అయితే ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ విషయంలో జారీ చేసిన నిబంధనల్లో కొన్నింటిని అధికారులు సరిగా పాటించలేదు. దీంతో అలాంటి ఓట్లను చెల్లని ఓట్లుగా పరిగణిస్తారంటూ ఆందోళనకు గురయ్యాయి ప్రధాన పార్టీలు. అదే గనక జరిగితే తమకు నష్టం వస్తుందని ఆలోచనకు వచ్చారు. వీటిలో ముఖ్యంగా గెజిటెడ్ ఆఫీసర్ స్టాంప్ విషయంలో చాలాచోట్ల నిబంధనలు సరిగా పాటించలేదు. ఇలాంటి నిబంధనలను సవరించి ప్రతి ఓటును చెల్లె ఓటుగా పరిగనించాలంటూ తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలతో పాటు పలు ఉద్యోగ సంఘాలు ఎన్నికల కమిషన్‎ను కోరాయి. ఆయా పార్టీలు, సంఘాల నుంచి వచ్చిన వినతులతో ఎన్నికల కమిషన్ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు పంపించారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. పోస్టల్ బ్యాలెట్‎లో ఏ ఓటు చెల్లుతుంది.. ఏ ఓట్ చెల్లదు అనే విషయాలను స్పష్టం చేస్తూ తాజాగా ఆదేశాలు ఇచ్చారు.

ఆ ఓట్లు కూడా చెల్లుతాయన్న ఎన్నికల కమిషన్..

ఆంధ్రప్రదేశ్‎లో 5 లక్షల 40 వేల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో ఎన్నికల్లో పాల్గొన్న సిబ్బందితోపాటు హోం ఓటింగ్ వేసిన వారు కూడా ఉన్నారు. డ్రైవర్లు, మెడికల్ అండ్ హెల్త్ సిబ్బంది, జర్నలిస్టులు వంటి అత్యవసర సర్వీసుల కింద కూడా ఉన్నవారు పోస్టల్ బ్యాలెట్‎ను వినియోగించుకున్నారు. అయితే పోస్టల్ బ్యాలెట్ వేసే సమయంలో ఫారం 13A పై పోలింగ్ బూత్‎లో ఉన్న గెజిటెడ్ అధికారి సంతకంతో పాటు సీల్ కూడా వేయాలి. కానీ చాలాచోట్ల గెజిటెడ్ అధికారులు సీల్ వేయలేదు. అయినప్పటికీ సంబంధిత అధికారి సంతకంతో పాటు అతని వివరాలు రాసినట్లయితే అలాంటి ఓట్లను కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. సీల్ లేదనే కారణంతో చెల్లని ఓట్లుగా పరిగణించవద్దని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

ఇక బ్యాలెట్ పేపర్ వెనుక ఆర్ఓ సంతకం లేకపోయినా ఆ బ్యాలెట్ చెల్లుతుందని స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్ పేపర్‎పై ఆర్ ఓ సంతకమును ధ్రువీకరించేందుకు రిజిస్టర్‎తో సరిపోల్చుకోవాలని స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్ కవర్ ఫారం C వాటర్ సంతకం లేదని బ్యాలెట్‎ను తిరస్కరించవద్దని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇక పోస్టల్ బ్యాలెట్‎లో ఒక అభ్యర్థి ఎదురుగా టిక్ మార్క్ పెట్టకపోయినా, బ్యాలెట్ చిరిగిపోయి ఉన్న, ఒకరికంటే ఎక్కువ అభ్యర్థుల ఎదుట ఉన్న అలాంటి ఓట్లను చల్లని ఓట్లుగా పరిగణించాలని స్పష్టం చేసింది. కౌంటింగ్ రోజు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు సంబంధించి ఆయా రాజకీయ పార్టీలు, ఏజెంట్లకు సమాచారం ఇచ్చి టేబుల్ల వారీగా కౌంటింగ్ మొదలు పెట్టాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్ ఇచ్చిన తాజా ఆదేశాలతో పోస్టల్ బ్యాలెట్‎లో చల్లని ఓట్లు సంఖ్య తగ్గే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..