Perni Nani: ఎమ్మెల్యే పిన్నెల్లిని హత్యచేయాలని టీడీపీ యత్నిస్తోంది.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు..

కూటమి నేతలు కోరిన అధికారులనే నియమిస్తున్నారు.. హింస జరిగిన తర్వాత కూడా పోలీసులు స్పందించలేదు.. అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు.. అంటూ వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎస్పీ సహా అధికారులకు పిన్నెల్లి ఫిర్యాదు చేశారని.. టీడీపీ దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదంటూ ఆరోపించారు.

Perni Nani: ఎమ్మెల్యే పిన్నెల్లిని హత్యచేయాలని టీడీపీ యత్నిస్తోంది.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు..
Perni Nani
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 26, 2024 | 1:56 PM

కూటమి నేతలు కోరిన అధికారులనే నియమిస్తున్నారు.. హింస జరిగిన తర్వాత కూడా పోలీసులు స్పందించలేదు.. అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు.. అంటూ వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎస్పీ సహా అధికారులకు పిన్నెల్లి ఫిర్యాదు చేశారని.. టీడీపీ దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదంటూ ఆరోపించారు. వైసీపీ నేతలపై ఏకపక్షంగా కేసులు పెడుతున్నారని.. పాల్వాయిగేట్‌లో దౌర్జన్యం జరిగితే అడ్డుకోలేదన్నారు. టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే..పోలీసులు ఎందుకు కేసులు పెట్టలేదంటూ పేర్ని నాని ప్రశ్నించారు. అసలు ముద్దాయిలను వదిలేస్తున్నారు.. తప్పు చేయనివారిపై కేసులు పెడుతున్నారంటూ పేర్ని నాని ఆరోపించారు. పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేస్తే.. 13వ తేదీనే ఎందుకు ఫిర్యాదు చేయలేదు.. డీజీపీకి సిట్‌ ఇచ్చిన నివేదికలో..పిన్నెల్లి ప్రస్తావన కూడా లేదు.. అంటూ పేర్ని నాని పేర్కొన్నారు. ఈ మేరకు పేర్ని నాని ఆదివారం మీడియాతో మాట్లాడారు.

పిన్నెల్లిని హత్యచేయాలని టీడీపీ యత్నిస్తోందని.. టీడీపీ కుట్రలకు పోలీసుల సహకారం ఉందంటూ.. పేర్ని నాని ఆరోపించారు. హత్యచేయాలనే ఆలోచనతోనే.. ఎమ్మెల్యే ఇంటిదగ్గర బలగాలను తొలగించారంటూ పేర్ని నాని పేర్కొన్నారు. పిన్నెల్లికి హాని జరిగితే ఐజీ, ఎస్పీ, DGPదే బాధ్యత అంటూ పేర్కొన్నారు. టీడీపీ నేతలతో కలిసి ఎస్సై నారాయణస్వామి కుట్రలు చేశారని.. అన్ని ఆధారాలతో చెబుతున్నామన్నారు. డీజీపీ విచారణ జరిపించాలంటూ పేర్ని నాని కోరారు.

ఇదిలాఉంటే.. పల్నాడులో అల్లర్లపై వైసీపీ వీడియోలు విడుదల చేసింది. వైసీపీ సానుభూతిపరుల నివాసాలు, షాపులపై.. టీడీపీ నేతలు దాడులు చేసిన వీడియోలను పేర్నినాని విడుదల చేశారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్