- Telugu News Photo Gallery Winter Skincare: How to Prevent Dry Skin and Acne in winter? Here's the solution
Winter Skincare: మచ్చలేని చందమామలాంటి ముఖం కావాలా? చలికాలంలో ఈ జాగ్రత్తలు అవసరం
చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల చర్మ సమస్యలు ఒక్కసారిగా దాడి చేస్తాయి. దీంతో ముఖంపై మొటిమలు, పొడిచర్మం వంటివి ఇబ్బంది పెడతాయి. ఈ సమ్యల నుంచి బయటపడాలంటే ఈ కింది సింపుల్ చిట్కాలు ట్రై చేయండి. మచ్చలేని అందం మీ సొంతం అవుతుంది..
Updated on: Dec 15, 2024 | 9:12 PM

చలికాలంలో చర్మ సంరక్షణ చాలా ముఖ్యం. చల్లని వాతావరణంలో చర్మం త్వరగా తేమను కోల్పోవడం ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో చర్మం పొడిగా మారి రంధ్రాలు మూసుకుపోవడం ప్రారంభమవుతుంది. దీని వల్ల చర్మం సరిగా శుభ్రపడదు. ముఖంపై ఉండే దుమ్ము, ధూళిని శుభ్రం చేయకపోతే మొటిమలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

డైట్ కూడా మొటిమలకు కారణం. ఎందుకంటే చలికాలంలో ఆయిల్, స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినడానికి ఇష్టపడతాం. దీని ప్రభావం చర్మంపై కనిపిస్తుంది. చలికాలంలో వచ్చే మొటిమలను ఎలా నివారించాలో ఇక్కడ తెలుసుకుందాం. చలికాలంలో చర్మంలో చమురు సమతుల్యత చెదిరిపోతుంది. ఇది మొటిమలకు దారితీస్తుంది. కాబట్టి ముఖాన్ని మాయిశ్చరైజ్ చేయడం చాలా ముఖ్యం. తేలికపాటి నాన్-కామెడోజెనిక్ (రంధ్రాలను అడ్డుకోదు) మాయిశ్చరైజర్ ఉపయోగించాలి.

చలికాలంలో చర్మం పొడిబారినప్పటికీ ముఖంపై మొటిమల సమస్య వస్తుంది. ఎందుకంటే చర్మ రంధ్రాలలో పేరుకుపోయిన దుమ్ము, నూనె, ధూళి మొటిమలకు దారితీస్తాయి. తేలికపాటి ఫేస్ వాష్‌తో ముఖాన్ని రోజుకు రెండుసార్లు కడగడం చాలా అవసరం. ఇది చర్మానికి తాజాదనాన్ని ఇవ్వడంతో పాటు మురికిని తొలగించి చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది.

అలాగే ముఖాన్ని పదేపదే తాకడం మానుకోవాలి. ఎందుకంటే చేతుల నుంచి మురికి, బ్యాక్టీరియా చర్మంపై పేరుకుపోతుంది. ఇది మొటిమలకు దారితీస్తుంది. శుభ్రమైన చేతులతో మాత్రమే ముఖాన్ని తాకడం బెటర్. మొటిమలను గోళ్ళతో పిండటం చేస్తే సమస్య మరింత పెంచుతుం

మొటిమలను తొలగించడంలో వేప నీరు సహాయపడుతుంది. ఇందుకోసం ముందుగా వేప ఆకులను తీసుకుని నీటిలో వేసి మరిగించాలి. నీరు మరిగిన తర్వాత, దానిని ఫిల్టర్ చేసి స్ప్రే బాటిల్‌లో నింపుకోవాలి. ఈ వేప నీటిని రోజుకు మూడు సార్లు ముఖంపై పిచికారీ చేస్తే సరి. మొటిమలు రానేరావు.




