Watch: పెళ్లికి రావాలని సీఎం చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
PV Sindhu Marriage: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, వ్యాపారవేత్త వెంకటదత్త సాయిల వివాహం ఈ నెల 22న రాజస్థాన్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో సింధు పలువురు సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులను కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందచేస్తున్నారు. ఆదివారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను కలిసి తన వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను కలిసి తన వివాహ వేడుకకు రావాలని ఆహ్వానించారు. పీవీ సింధు, వ్యాపారవేత్త వెంకటదత్త సాయిల వివాహం ఈ నెల 22న రాజస్థాన్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో సింధు పలువురు సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులను కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందచేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ను కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందించారు. అనంతరం ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి పీవీ సింధు ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆమెకు విషెస్ తెలియజేశారు. పీవీ సింధు వెంట ఆమె తండ్రి పి.వి. రమణ ఉన్నారు. పీవీ సింధు శనివారంనాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేయడంతో తెలిసిందే.
Published on: Dec 15, 2024 09:38 PM
వైరల్ వీడియోలు
Latest Videos