ఈ టైంలో బెల్లం తిన్నారంటే ఒంట్లో రోగాలన్నీ పరార్.. ఆయుర్వేద చిట్కా
15 December 2024
TV9 Telugu
TV9 Telugu
చక్కెరలో ప్రయోజనాల కంటే నష్టమే అధికం..అదే బెల్లం తింటే ఎన్ని లాభాలున్నాయో.. ఈ విషయం నాటి తరం వ్యక్తులు ఎంత చెప్పినా నేటి తరం వాళ్లు బెల్లం తినాలంటే అనాసక్తి చూపిస్తున్నారు
TV9 Telugu
చిన్నారులు, పెద్దలు ఇకనైనా రోజూ కొంత బెల్లం తింటే ఆరోగ్యం చక్కగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. బెల్లంలో ఉండే పోషకాలు అలాంటివి మరి
TV9 Telugu
అజీర్తి, మలబద్దకం, నెలసరిలో చిక్కులు, రక్తహీనత లాంటి వాటిని ఇట్టే మటుమాయం చేసే శక్తి బెల్లంలో ఉంది. ముఖ్యంగా చలికాలంలో బెల్లం ఎక్కువగా తీసుకోవాలి
TV9 Telugu
బెల్లంలో క్యాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, జింక్, కాపర్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి కాంప్లెక్స్ వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి
TV9 Telugu
అందుకే రోజూ కొంచెం బెల్లం తినడంతో అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. బెల్లాన్ని నేరుగా కాకుండా ఇతర పదార్థాలతో కలిపి తీసుకుంటే మరింత మంచి ఫలితాలు వస్తాయి
TV9 Telugu
అయితే చలికాలంలో బెల్లం ఏ సమయంలో తినాలో చాలా మందికి తెలియదు. ఈ సీజన్‌లో బెల్లం తినడం ద్వారా విటమిన్ బి12 పెరగడంతో పాటు, ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి
TV9 Telugu
రాత్రిపూట వేడి పాలతో కాస్త బెల్లం కలిపి తాగితే జలుబును నివారిస్తుంది. పైగా విటమిన్ B12 కూడా సమృద్ధిగా అందిస్తుంది. ప్రతిరోజూ బెల్లం తినడం జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది
TV9 Telugu
దీన్ని తినడం వల్ల గ్యాస్, అజీర్ణం, వికారం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరాన్ని శక్తివంతంగా ఉంచుకోవాలనుకుంటే, అలాగే రోగనిరోధక శక్తి బలంగా ఉండాలంటే, భోజనం తర్వాత ఓ బెల్లం ముక్క తినడం ప్రారంభించాలి