Samantha-Rana: ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ పోస్ట్..
ఈరోజు నటుడు రానా దగ్గుబాటి పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నటి సమంత రానాకు ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్ తెలియజేశారు. సామ్ తన ఇన్‌స్టాలో రానాకు విషెష్ చెబుతూ పోస్ట్ పెట్టారు. ‘‘హ్యాపీ బర్త్‌డే డియర్ రానా. మీరు ప్రతి పనిలోను 100శాతం శ్రమిస్తారు.
ఆ శ్రమించేతత్వం నాలో ఎంతగానో స్ఫూర్తి నింపింది. నేను చేసే ప్రతి పనిని ఇంకా బాగా చేసేలా అది నన్ను ప్రేరేపిస్తుంది. నేను ఎప్పటికీ మీ అభిమానినే. దేవుడి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సినీప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. మరోవైపు, రానా పుట్టినరోజు సందర్భంగా రామ్‌చరణ్ కూడా విషెస్ తెలిపారు. ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. తన స్నేహితుడికి అంతా మంచే జరగాలని కోరుకున్నారు. రానా-సమంత మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. ‘బెంగళూరు డేస్’ తమిళం రీమేక్ కోసం రానా – సమంత కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ సినిమా చిత్రీకరణ సమయం నుంచే వీరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. రానా తనకు అన్న లాంటివాడని సామ్ పలు సందర్భాల్లో చెప్పారు.
‘‘రానా.. మై బ్రదర్. ప్రతి అమ్మాయికి రానా లాంటి సోదరుడు ఉండాలి’’ అని తెలిపారు. ఇటీవల జరిగిన ఐఫా అవార్డుల ప్రదానోత్సవంలో రానా కూడా సమంతను మై సిస్టర్ అని సంభోదించారు. సమంత ప్రస్తుతం ‘రక్త్‌బ్రహ్మాండ్’ అనే వెబ్ సిరీస్ కోసం వర్క్ చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఇది రెడీ అవుతోంది. ఆమె నటించిన ‘సిటాడెల్ హనీ బన్నీ’ నవంబరులో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఏజెంట్ హనీగా సమంత యాక్టింగ్‌కు ప్రశంసలు దక్కాయి. ఇక రానా ‘ది రానా దగ్గుబాటి షో’ తో అభిమానులను అలరిస్తున్నాడు. ఈ షో ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.