TOP 9 ET: అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్.?| అంతకంతకూ పెరుగుతున్న పుష్ప 2 కలెక్షన్స్
అల్లు అర్జున్ చంచల్‌గూడ జైలు నుంచి బయటికి రావడంతో.. అప్పటిదాకా టెన్షన్‌లో ఉన్న టాలీవుడ్ సెలబ్రిటీలందరూ ఒక్కసారిగా రిలాక్సయ్యారు. బన్నీని పర్సనల్‌గా కలిసి మాట్లాడడం.. ధైర్యం చెప్పడమే ప్రైమరీ పనిగా పెట్టుకున్నారు. అయితే దాదాపు అందరూ హీరోలు, డైరెక్టర్లు బన్నీ ఇంటి దగ్గర కనిపించారు కానీ.. ట్రిపుల్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు మాత్రం కనిపించలేదు. దీంతో వీరు ఎందుకు రాలేదని నెట్టింట చిన్న డిస్కషన్.
01.allu arjun: అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, రామ్ చరణ్.?
అల్లు అర్జున్ చంచల్‌గూడ జైలు నుంచి బయటికి రావడంతో.. అప్పటిదాకా టెన్షన్‌లో ఉన్న టాలీవుడ్ సెలబ్రిటీలందరూ ఒక్కసారిగా రిలాక్సయ్యారు. బన్నీని పర్సనల్‌గా కలిసి మాట్లాడడం.. ధైర్యం చెప్పడమే ప్రైమరీ పనిగా పెట్టుకున్నారు. అయితే దాదాపు అందరూ హీరోలు, డైరెక్టర్లు బన్నీ ఇంటి దగ్గర కనిపించారు కానీ.. ట్రిపుల్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు మాత్రం కనిపించలేదు. దీంతో వీరు ఎందుకు రాలేదని నెట్టింట చిన్న డిస్కషన్. ఈక్రమంలోనే వీరిద్దరూ బన్నీతో.. పర్సనల్‌గా ఫోన్‌లో మాట్లాడారని.. ఐకాన్ స్టార్ కు స్టే స్ట్రాంగ్ అంటూ ధైర్యం చెప్పారని ఇన్‌సైడ్ టాక్.
02.AA: అల్లు అర్జున్ జైలుకెళ్లడంతో.. హీరో అయిన పల్లవి ప్రశాంత్.!
అల్లు అర్జున్ జైలుకెళ్లే ప్రాసస్‌లో.. చాలా మంది హీరోలుగా మారారు. మీడియా ఫోకస్‌లోకి వచ్చేశారు. అలా తాజాగా బిగ్ బాస్ ఫేమ్ పల్లవి ప్రశాంత్ కూడా హీరోగా మారిపోయాడు. నెట్టింట తెగ వైరల్ అవుతున్నాడు. బన్నీ నాంపల్లి కోర్టు తీర్పు మేరకు చంచల్‌గూడ్ జైలుకెళ్లడం.. గతంలో బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత జరిగిన గొడవల కారణంగా.. పల్లవి ప్రశాంత్ కూడా ఇదే జైలు కొళ్లడంతో.. ఆ ఫుటేజీని బయటికి తీసి వైరల్ చేస్తున్నారు. దీంతో మరో సారి అందరూ ఈ రైతు బిడ్డ గురించి మాట్లాడుకునేలా చేస్తున్నారు.
03. Mohan Babu: పరారీలో మోహన్ బాబు స్ట్రాంగ్ రియాక్షన్.!
రెండు మూడు రోజులుగా మంచు ఇంట జరుగుతున్న హంగామా కాస్త సైలెంట్ అయిందని అందరూ అనుకునేలోపే.. ఈ ఇంటి పెద్ద మోహన్ బాబుకు సంబంధించిన ఓ న్యూస్ బయటికి వచ్చింది. కోర్టు, మోహన్ బాబు పెట్టిన ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో.. పోలీసులకు చిక్కకుండా ఆయన పరారీలో ఉన్నట్టు ఓ న్యూస్ వైరల్ అయింది. దీంతో రంగంలోకి దిగిన మోహన్ బాబు తాజాగా ఓ ట్వీట్ చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ముందస్తు బెయిల్‌ను కోర్టు తిరస్కరించలేదంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు బాబు. అంతేకాదు తాను తన ఇంట్లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నా అంటూ క్లారిటీ ఇచ్చారు.
04. Daaku Maharaj: మహరాజ్ హుకుం..
బాలకృష్ణ, బాబీ కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ డాకూ మహరాజ్. ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. సాంగ్స్ కూడా త్వరలోనే విడుదల కానున్నాయి. ఈ క్రమంలోనే మొదటి పాటకు ముహూర్తం పెట్టారు బాలయ్య. డిసెంబర్ 14న ఫస్ట్ సాంగ్ రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
05.Pushpa 2: అంతకంతకూ పెరుగుతున్న పుష్ప 2 కలెక్షన్స్.
పుష్పరాజ్ కొత్త చరిత్రకు తెరతీసారు. తొలి 8 రోజుల్లోనే 1067 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డ్‌లను చెరిపేసింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2.. 9వ రోజు కూడా అదే దూకుడు చూపించింది. వీకెండ్ అయ్యేసరికి నేషనల్ వైడ్‌గా అద్భుతమైన వసూళ్లు సాధించింది ఈ చిత్రం. ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు యూనిట్.
06.bramhaji: అల్లు అర్జున్ అరెస్ట్.. చిరు మాటలను గుర్తు చేసిన బ్రహ్మాజీ.!
ఆన్ స్క్రీన్ డైలాగులు చెప్పడంలోనే కాదు.. ఆఫ్ స్క్రీన్ సూక్తులు లాంటి మాటలు చెప్పడంలోనూ.. తనను నమ్ముకున్న వారికి అండగా నిలబడడంలోనూ.. తన వెన్నంటి నడిచే వారి కష్టాలు తీర్చడంలోనూ.. ఎప్పుడూ ముందుటారు చిరు. అయితే ఆ తీరును మరో సారి తన మాటల్లో ఓ సందర్భంలో వివరించారు బ్రహ్మాజి. అందరూ బాగునప్పుడు నేను పట్టించుకోను.. కానీ ఏమన్నా అయితే నేనే ముందుంటూ అంటూ మెగా స్టార్ చిరు గతంలో తనకు చెప్పాడంటూ ఈ స్టార్ యాక్టర్ ఓ సందర్భంలో ఓ ఈవెంట్లో చెప్పాడు. అయితే ఆ వీడియో అల్లు అర్జున్ అరెస్ట్ అండ్ బెయిల్ నేపథ్యంలో ఇప్పుడు బయటికి వచ్చింది. నెట్టింట వైరల్ అవుతోంది.
07.bunny lawe: ఒక్క సారిగా హీరోగా మారిపోయిన బన్నీ లాయర్.
సిల్వర్ స్క్రీన్ పై బన్నీనే హీరో కావచ్చు. బన్నీ బెయిల్ ఎపిసోడ్‌లో.. లాయర్ నిరంజన్ రెడ్డినే హీరో అంటున్నారు కొంత మంది నెటిజన్లు. బన్నీకి అప్పటికే నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో.. బన్నీ తరుపున హైకోర్టులో మధ్యంతర బెయిల్ ఫైల్ చేశాడు ఈయన. ఫైల్ చేయడమే కాదు జడ్జి ముందర వాడీ వేడీగా తన వాదనలు విడిపించి ఎట్టకేలకు ఐకాన్ స్టార్‌కు బెయిల్ వచ్చేలా చేశాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో.. ఇప్పుడు నిరంజన్ రెడ్డి సోషల్ మీడియాలో హీరోగా మారిపోయాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే… నిరంజన్ రెడ్డి సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు. అండ్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాకు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ .
08. surya: ఇక సూర్యతో సినిమా చేయను.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్.
కోలీవుడ్‌లో మాత్రమే కాదు ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలోనే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్ సూర్య. అలాంటి సూర్య అవకాశం ఇవ్వాలే కానీ.. ఏ డైరెక్టర్ అయినా ఎగిరిగంతేస్తారు. కానీ కోలీవుడ్‌లో కాంట్రో డైరెక్టర్ మిష్కిన్ మాత్రం సూర్యతో అవకాశం వచ్చినా సినిమా చేయనంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఈ డైరెక్టర్ స్టేట్మెంట్ ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. నెట్టింట వైరల్ అవుతోంది. ముందు సూర్య నీకు ఛాన్స్ ఇస్తే కదా.. అనే కామెంట్ కూడా ఫన్నీగా సూర్య ఫ్యాన్స్ నుంచి సోషల్ మీడియాలో వస్తోంది.
09.vishnu: కొడుకు చెప్పిన నిజంతో చిక్కుల్లో పడ్డ మోహన్ బాబు.
టీవీ9 రిపోర్టర్ రజింత్ పై మోహన్ బాబు దాడి చేయడం సంచలంగా మారింది. మోహన్ బాబు తీరును అందరూ విమర్శించేలా తప్పుబట్టేలా చేసింది. అయితే ఈ ఘటన పై రెండు రోజుల క్రితం రియాక్టైన మోహన్ బాబు.. జర్నలిస్టు సమాజానికి సారీ చెబుతూనే.. తన దాడిని సమర్ధించుకునే ప్రయత్నం చేశాడు. బలవంతంగా తన ఇంటి ఆవరణలోకి ప్రవేశించారు కాబట్టే.. ఆవేశంతో కొట్టా అంటూ చెప్పారు. అయితే మోహన్ బాబు మాటలు తప్పు అనేలా.. ఆయన సమర్ధింపులు తేలిపోయేలా.. మంచు మనోజ్ అసలు విషయం చెప్పారు. తనపై దాడి జరుగుతున్న క్రమంలోనే తానే జర్నలిస్టులను గేట్ తీసి మరీ లోపలికి రావాలని పిలిచినట్టు ఓ ట్వీట్ చేశాడు. దీంతో మోహన్ బాబు తీరుపై మరోసారి నెట్టింట తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
10.bunny vasu: మరో సారి భరోసా.. ఆ బాలుడికి మేం అండగా ఉంటాం.
తొక్కిసలాటలో గాయపడిన రేవతి కుమారుడిని స్టార్ ప్రొడ్యూసర్ , ఐకాన్ స్టార్ క్లోజ్ ఫ్రెండ్ బన్నీ వాస్ పరామర్శించాడు. ఆసుపత్రికి వెళ్లి మరీ బాలుడి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నాడు. వైద్య ఖర్చులు తామే భరిస్తామని.. కుటుంబానికి అండగా ఉంటామని బాలుడి తండ్రికి అల్లు అర్జున్ తరుపున హామీ ఇచ్చాడు బన్నీ వాసు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.