AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఏపీలో అప్పుడే మొదలైన పందెంరాయుళ్ల హడావిడి

సంక్రాంతి అంటే కోడి పందాలు... కోడిపందాలు అంటే సంక్రాంతి. ఈ రెండింటినీ విడదీసి చూడలేం. అయితే కోడి పందేలా విషయంలో ప్రతి ఏడాది లాగా కాదు.. ఈ సారి కథ వేరే ఉంటదంటున్నారు పోలీసులు. సంక్రాంతికి ముందే కోళ్లు కత్తు దూస్తుండటంతో పోలీసులు చర్యలు చేపడుతున్నారు.

AP News: ఏపీలో అప్పుడే మొదలైన పందెంరాయుళ్ల హడావిడి
Cockfight
Ram Naramaneni
|

Updated on: Dec 15, 2024 | 9:05 PM

Share

ఏపీలో అప్పుడే పందెం కోళ్లు కత్తులు దూస్తున్నాయి. సంక్రాంతి పండగకు నెలరోజుల ముందే పందెం రాయుళ్లు కాయ్‌ రాజా కాయ్‌ అంటున్నారు. కోళ్లకు కత్తులు కట్టి కొట్లాట పెట్టారు. బరిలో బస్తీ మే సవాల్ అని తొడలు కొడుతున్నారు. పోలీసుల నిబంధనలకు విరుద్ధంగా పట్టపగలే కోళ్ల పందాలు నిర్వహిస్తున్నారు. కృష్ణాజిల్లా గుడివాడ బైపాస్ రోడ్డులో బరులు ఏర్పాటు చేసి కోడి పందాలు నిర్వహిస్తున్నారు. వేలల్లో డబ్బులు చేతులు మారుతున్నాయి. కోళ్ల పందాలపై సమాచారం అందుకున్న గుడివాడ రూరల్ పోలీసులు బరులపై దాడులు చేశారు. పోలీసులను చూసి పందెంరాయుళ్లు పరుగులు పెట్టారు. కోడిపందాల బరుల దగ్గర నలుగురిని అదపులోకి తీసుకున్నారు పోలీసులు. 25 బైక్‌లు, రెండు ఆటోలు, కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు.

కోడి పందేలా విషయంలో ప్రతి ఏడాది లాగా కాదు.. ఈ సారి కథ వేరే ఉంటదంటున్నారు పోలీసులు. నిబంధనలు అతిక్రమించి ఎక్కడైనా కోడిపందేలు నిర్వహిస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. సంక్రాంతి ముసుగులో కోడిపందేలు, గుండాటలు నిర్వహించకుండా చర్యలు చేపడుతున్నారు. యువత కోడిపందేలు, గుండాటల జోలికి వెళ్ల కుండా సంప్రదాయ క్రీడా పోటీలపైనే దృష్టి పెట్టాలని సూచించారు. కబడ్డీ, వాలీబాల్ లాంటి వాటిపై యువతరం దృష్టి సారించాలన్నారు పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్