AP Elections: ఏపీలో మళ్లీ ఎన్నికల సందడి రాబోతోంది.. ఈ నెల 23న నోటిఫికేషన్..
ఆంధ్ర ప్రదేశ్‌లో మళ్లీ మున్సిపల్ ఎన్నికల సందడి రాబోతోంది. 13 చోట్ల ఎన్నికలు జరగబోతున్నాయి. కొన్ని కారణాల వల్ల మొన్న జరగని స్థానాలకు ఇప్పుడు..
Andhra Pradesh Election Notification: ఆంధ్ర ప్రదేశ్‌లో మళ్లీ మున్సిపల్ ఎన్నికల సందడి రాబోతోంది. 13 చోట్ల ఎన్నికలు జరగబోతున్నాయి. కొన్ని కారణాల వల్ల మొన్న జరగని స్థానాలకు ఇప్పుడు నిర్వహించాలని కసరత్తు చేస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. నెల్లూరు కార్పొరేషన్‌తోపాటు 12 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగాలి. పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఈ నెల 23న తుది నోటిఫికేషన్ వస్తుంది. నెల్లూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లిలో ఎన్నికలు జరుగుతాయి. గురజాల, దాచేపల్లి, దర్శి, కుప్పం, బేతంచెర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాల్టీలకు త్వరలో ఎన్నికలు జరుగుతాయి.
కాగా, పురపాలక ఎన్నికల సమరానికి సింహపురి ఇప్పుడే సన్నద్ధమవుతోంది. మున్సిపల్ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపిక చేయడంతో ఒక్కసారిగా రాజకీయ వ్యూహాలు తెరపైకి వచ్చాయి. సార్వత్రిక ఎన్నికల నుంచి అన్ని ఎన్నికల్లోనూ విజయఢంకా మోగిస్తున్న అధికార పార్టీ వైయస్ఆర్‌సీపీ పుర ఎన్నికల్లోనూ సత్తా చాటి క్లీన్ స్వీప్ చేయాలనే దిశగా అడుగులు వేస్తోంది. టీడీపీ కనీసం పరువు దక్కించుకునే రీతిలోనైనా పోరాటం చేయాలని చర్చలు చేస్తోంది.
జిల్లాలో నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు, గ్రేడ్–1 మున్సిపాలిటీలు గూడూరు, కావలిల్లో పుర రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా నెల్లూరు నగర పాలక సంస్థ ఎన్నికలకు ఎస్‌ఈసీ ఆదివారం రిటర్నింగ్ అధికారులను నియమించడంతో పుర పోరు షురూ అయింది. జిల్లాలో నెల్లూరు నగర పాలక సంస్థతో పాటు కావలి, గూడూరు, ఆత్మకూరు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ ఏడాది మేలో ఎన్నికల నోటిఫికేషన్ సమయానికి నెల్లూరు, గూడూరు, కావలి పుర ఎన్నికలపై కోర్టుల్లో వ్యాజ్యాలు ఉండడంతో వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
Read also: Kesineni Nani: టీడీపీకి బిగ్ షాక్.. ఆఫీసులో చంద్రబాబు ఫోటోలు తీసేసిన కేశినేని నాని