Andhra Pradesh: మంగళవారం సెలవు ప్రకటించిన ఏపీ సర్కార్
ఏపీ సర్కార్ రేపు(మంగళవారం) సెలవు ప్రకటించింది. ‘ఈద్ మిలాద్ ఉన్ నబీ’ సందర్భంగా బుధవారానికి బదులు మంగళవారం ప్రభుత్వ సెలవును ప్రకటిస్తూ...
ఏపీ సర్కార్ రేపు(మంగళవారం) సెలవు ప్రకటించింది. ‘ఈద్ మిలాద్ ఉన్ నబీ’ సందర్భంగా బుధవారానికి బదులు మంగళవారం ప్రభుత్వ సెలవును ప్రకటిస్తూ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ స్టేట్ వక్ఫబోర్డు సీఈవో సూచన మేరకు సెలవు దినంలో మార్పులు చేసినట్టు పేర్కొంది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ముస్లింలు.. మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని మిలాద్-ఉన్-నబీగా జరుపుకుంటారు. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం.. మూడో నెల రబీ-అల్-అవ్వల్‌లో పౌర్ణమి ముందురోజు మహ్మద్ ప్రవక్త జన్మించినట్టు చరిత్ర చెబుతోంది. సర్వమానవాళి శ్రేయస్సు, శాంతిని నెలకొల్పడం కోసం ఆఖరి ప్రవక్తగా మహమ్మద్‌ను ఎన్నుకున్నట్లు పవిత్ర ఖురాన్ షరీఫ్‌లో చెప్పబడింది. విశ్వ ప్రవక్త మహమ్మద్ కేవలం ముస్లింల కోసం కాదని… ఈ ప్రపంచానికి, ఈ విశ్వానికి ప్రవక్తగా అల్లాహ్ నియమించారని అందులో పేర్కొన్నారు. ఏకోపాసన, మానవులంతా ఒక్కటేనని తారతమ్యాలు లేవని అంతా అల్లాహ్ దాసులేనని విశ్వ ప్రవక్త మహమ్మద్ (ప్రవక్త) ప్రబోధించారు. శాంతి, దానం, దైవభీతితో మెలగాలని సూచించారు. మహమ్మద్ (ప్రవక్త) సోమవారం నాడు జన్మించినట్లు, ఆయనకు 40వ ఏట ప్రవక్త పదవి వరించిందని మత పెద్దల ద్వారా తెలుస్తోంది. ప్రపంచ మంతటా ఆయన జన్మదినాన్ని పండుగలా చేసుకుంటారు. ఆయన జయంతి వేడుకలను ‘‘మిలాద్ – ఉన్ – నబీ’’ అని అరబ్బీలో అంటారు. ఇండియాలో ప్రవక్త పుట్టిన రోజున ఆయనను స్మరించుకుంటూ ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ రోజున ముస్లింలు ప్రత్యేకంగా ప్రేయర్స్ చేసి, ప్రవక్త ముహమ్మద్‌ను స్మరించుకుని ఆయన చూపిన మార్గంలో నడుస్తామని సంకల్పం చేసుకుంటారు.
Also Read: మంచు విష్ణు సంచలన ప్రెస్‌మీట్.. పవన్, చిరంజీవి సహా కీలక విషయాలపై కామెంట్స్
పండక్కి అత్తగారింటకి వచ్చి బైక్స్‌కు ఫైన్ వేసిన ఎస్సై… గ్రామస్తులు ఏం చేశారంటే