Kesineni Nani: టీడీపీకి బిగ్ షాక్.. ఆఫీసులో చంద్రబాబు ఫోటోలు తీసేసిన కేశినేని నాని

MP Kesineni Nani: బెజవాడ రాజకీయంలో భారీ కుదుపు.. కేశినేని భవన్ పార్లమెంట్ ఆఫీసులో చంద్రబాబు ఫోటోలు తొలగింపు

Kesineni Nani: టీడీపీకి బిగ్ షాక్.. ఆఫీసులో చంద్రబాబు ఫోటోలు తీసేసిన కేశినేని నాని
Kesineni
Follow us

|

Updated on: Oct 18, 2021 | 10:28 AM

Kesineni Nani: బెజవాడ రాజకీయాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. తెలుగు దేశంలో స్ట్రాంగ్ అనుకున్న లీడర్. ఆరునూరైనా గెలిచి తీరే కసి ఉన్న నేత, మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు కేశినేని ఇప్పుడు టీడీపీ జెండా పీకేస్తున్నారన్నదే ఆ హాట్ టాపిక్.

అవును, కేశినేని నాని క్యాంప్ కార్యాలయంలో ఇన్నాళ్లూ ఉన్న చంద్రబాబు ఫోటోలు ఇప్పుడు లేవు. ఆ ప్లేస్‌లో రతన్‌ టాటా ఫోటోలు వెలిశాయి. తన ఎంపీ నియోజకవర్గంలో ఏడుగురు ఇంచార్జ్‌లతో కలిసి ఉన్న ఫోటోలు కూడా పోయి.. ఐదేళ్లలో తాను టాటా ట్రస్ట్ తరఫున చేసిన సేవా కార్యక్రమాల ఆనవాళ్లు గోడలపై ప్రత్యక్షమయ్యాయి.

సేవే పరమావధి అనుకున్నా.. చంద్రబాబు, టీడీపీ నేతల ఫోటోలు పీకేయాల్సిన పనిలేదు. కానీ వాటిని తొలిగించి మరీ కొత్త ఫోటోలు పెట్టారంటే.. తాను రాజకీయాలకు దూరం అని సంకేతాలిస్తున్నారా? కాదంటే.. టీడీపీకి మాత్రమే దూరం అని చెప్పదలచుకున్నారా?

బెజవాడ సహా ఏపీలో ఇప్పుడో కొత్త చర్చ ఏంటంటే.. నానీ బీజేపీలోకి జంప్ అవుతున్నారని. ఇప్పటికే కమలం పెద్దలతో చర్చలూ ముగిశాయంటున్నారు. ఈ పడవ నుంచి కాలు ఆ పడవలో పెడితే పదవి కూడా దక్కొచ్చని జోస్యం చెబుతున్నారు. వీటిల్లో ఏది నిజమో చెప్పాలసింది మాత్రం నానీనే.

కాగా, విజయవాడ మున్సిలప్ కార్పొరేషన్‌ ఎన్నికల టైమ్ నుంచీ లోకల్ తెలుగు దేశంలో కొన్ని లుకలుకలు కనిపించాయి. ఆయన కుమార్తె శ్వేతను కార్పొరేషన్ చైపర్సన్ అభ్యర్థిగా ఓకే చేయించుకోడానికి కూడా అనేక డక్కాముక్కీలు తినాల్సి వచ్చింది. అప్పట్లో దేవినేని గ్రూప్‌, కేశినేని గ్రూప్ అంటూ రెండు వర్గాలు బెజవాడ టీడీపీని దెబ్బతీస్తున్నాయనే టాక్ కూడా వచ్చింది. ఆ తర్వాత అంతా ఒక్కటయినట్లు కనిపించినా.. లోలోన ఫైర్ మాత్రం అలాగే ఉందన్నది తాజాగా ఫోటోల మ్యాటర్ చెబుతున్న సీన్.

కొన్నాళ్ల నుంచి పార్టీకి, పార్టీ అధిష్టానానికి అంటీముట్టనుట్లు ఉన్న కేశినేని తాను ఇక పోటీ చెయ్యనని చెప్పేశారు. నెక్ట్స్ ఎలక్షన్‌ టైమ్‌కి తన ప్లేస్‌లో మరో కొత్త లీడర్‌ను సెలక్ట్ చేసుకోవాలని కూడా సూచించారు. అయినా కూడా అధిష్టానం తనను బుజ్జగించే ప్రయత్నం కూడా చెయ్యలేదన్న బాధ కేశినేనిలో ఉందన్నది ఆయన సన్నిహితులు చెబుతున్నమాట. మరోవైపు బీజేపీతో చర్చలు జరిగాయని, కేంద్రంలో పదవి ఉందంటూ వస్తున్న ఊగాహానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. మొత్తంగా అలకో, ఆఫరో గానీ.. కేశినేని బస్సు వెళ్లిపోతున్నట్లు పక్కా సిగ్నల్ ఇచ్చేశారాయన.

Read also: Kerala: కేరళలో వర్షాలు, వరదల బీభత్సం.. మరో 48 గంటలపాటు కుండపోత హెచ్చరిక, 26కి చేరిన మృతులు

Latest Articles
సల్మాన్‌ ఖాన్‌ ఇంటిపై కాల్పులు.. నిందితుల్లో ఒకరు జైల్లోనే మృతి !
సల్మాన్‌ ఖాన్‌ ఇంటిపై కాల్పులు.. నిందితుల్లో ఒకరు జైల్లోనే మృతి !
ఏంటీ..!! ఈ క్రేజీ హీరోయిన్ ఆర్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్టా..!
ఏంటీ..!! ఈ క్రేజీ హీరోయిన్ ఆర్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్టా..!
ఈ చేపలు తిన్నారంటే.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉండనే ఉండదు..
ఈ చేపలు తిన్నారంటే.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉండనే ఉండదు..
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ.. ఈ తేదీల్లో పర్యట
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ.. ఈ తేదీల్లో పర్యట
వ్యర్థ ఉత్పత్తులతో అదిరే బిజినెస్..ఆ వ్యాపారంలో రాణిస్తున్న మహిళ
వ్యర్థ ఉత్పత్తులతో అదిరే బిజినెస్..ఆ వ్యాపారంలో రాణిస్తున్న మహిళ
గూస్‌బంప్స్ తెప్పిస్తున్న పుష్ప ఫస్ట్ సాంగ్..
గూస్‌బంప్స్ తెప్పిస్తున్న పుష్ప ఫస్ట్ సాంగ్..
ఆపద సమయాల్లో ఆరోగ్య భరోసా నిల్.. ఆ పాలసీలతో అధిక నష్టాలు..!
ఆపద సమయాల్లో ఆరోగ్య భరోసా నిల్.. ఆ పాలసీలతో అధిక నష్టాలు..!
'టీడీపీ, జనసేన మేనిఫెస్టోలో బీజేపీలోగో లేదు'.. కేశినేని నాని
'టీడీపీ, జనసేన మేనిఫెస్టోలో బీజేపీలోగో లేదు'.. కేశినేని నాని
అమ్మా నా బెడ్ రూమ్‌లో దెయ్యాలు ఉన్నాయ్.. చిన్నారి కంటతడి.. చివరకు
అమ్మా నా బెడ్ రూమ్‌లో దెయ్యాలు ఉన్నాయ్.. చిన్నారి కంటతడి.. చివరకు
ఐపీఎల్ నుంచి హార్దిక్ పాండ్యా నిషేధం.. కారణం ఏంటంటే?
ఐపీఎల్ నుంచి హార్దిక్ పాండ్యా నిషేధం.. కారణం ఏంటంటే?