DL Assets: వందలకోట్లు ఎలా సంపాదించారు.? డీఎల్ రవీంద్రారెడ్డికి ఏపీ వ్యవసాయ సలహాదారు ప్రశ్న
ఏపీ రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పదవికి తాను అనర్హుడనని రైతులు చెబితే రాజీనామా చేస్తానని ప్రకటించారు అంబటి కృష్ణారెడ్డి. వైసీపీ రెబల్ నేత
DL Ravindra Reddy vs Ambati Krishna Reddy: ఏపీ రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పదవికి తాను అనర్హుడనని రైతులు చెబితే రాజీనామా చేస్తానని ప్రకటించారు అంబటి కృష్ణారెడ్డి. వైసీపీ రెబల్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యలకు పై విధంగా కౌంటరిచ్చారాయన. పనిలో పనిగా డీఎల్ రవీంద్రారెడ్డి.. వందల కోట్లు ఎలా సంపాదించావ్? అంటూ ప్రశ్నలు లేవనెత్తారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయనకు సుంకేసులలో చిన్న కొట్టం, రేకుల ఇల్లు ఉండేదని, ఇప్పుడు హైదరాబాద్‌లో రూ.200 కోట్ల విలువైన ఆస్పత్రి, రూ.20 కోట్ల విలువైన ఇల్లు, వందల ఎకరాల భూములు ఉన్నాయని అంబటి చెప్పారు.
డీఎల్ రవీంద్రారెడ్డి సంపాదించిన ఆస్తులను ఏ వ్యాపారం చేసి సంపాదించారో చెప్పాలని అంబటి నిలదీశారు. జీవీ సత్రం వద్ద తల్లిదండ్రుల పేరుతో ఆస్పత్రి కడతానని ప్రభుత్వం నుంచి చౌక ధరకు భూమిని పొంది, తర్వాత దాన్ని విక్రయించి సొమ్ము చేసుకున్నాడని విమర్శించారు అంబటి.
డీఎల్ రవీంద్రారెడ్డి బాగు అంతా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పెట్టిన రాజకీయ భిక్ష వల్లే లభించిందన్నారు అంబటి. గతంలో మంత్రి పదవిలో ఉండి వైఎస్ జగన్‌కు పోటీగా ఎంపీగా నిలబడి, డిపాజిట్ కూడా దక్కకుండా చిత్తుగా ఓడిన చరిత్ర డీఎల్‌దే అన్నారు. వైఎస్ కుటుంబం దెబ్బ రుచి చూసినా ఆయనకు బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు.
తాను వ్యవసాయ సలహాదారు పదవికి తాను తగనని డీఎల్ మాట్లాడటం బాధాకరమని పేర్కొన్నారు. తాను వ్యవసాయదారుల కుటుంబంలో పుట్టానని, 50 ఎకరాల పొలాన్ని ఇప్పటికీ సాగు చేస్తున్నానని తెలిపారు.
Read also: CM YS Jagan: పడమటలోని గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి వెళ్లిన సీఎం జగన్..