AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Audio: రాజమండ్రి నుంచి 10 మందిని దించేస్తా.. ఖతం చేయిస్తా.. తోటి ఉద్యోగులను బెదిరించిన ఓ ప్రభుత్వ అధికారి ఆడియో వైరల్..

నేనేం చేసినా ఎదురుచెప్పొద్దు.. ఆఫీస్‌లో జరిగే విషయాలు బయటకి లీక్‌ చేయొద్దు.. నా మాట వినకుంటే రాజమండ్రి గ్యాంగ్‌ తో చెప్పి ఖతం చేయిస్తా.. ఇలా ఓ అధికారి.. తోటి ఉద్యోగులను బెదిరించాడు. మహిళా ఉద్యోగులను కూడా దుర్భాషలాడాడు.

Viral Audio: రాజమండ్రి నుంచి 10 మందిని దించేస్తా.. ఖతం చేయిస్తా.. తోటి ఉద్యోగులను బెదిరించిన ఓ ప్రభుత్వ అధికారి ఆడియో వైరల్..
Apd Chinna Srinivas
Sanjay Kasula
|

Updated on: Aug 19, 2021 | 11:52 AM

Share

నేనేం చేసినా ఎదురుచెప్పొద్దు.. ఆఫీస్‌లో జరిగే విషయాలు బయటకి లీక్‌ చేయొద్దు.. నా మాట వినకుంటే రాజమండ్రి గ్యాంగ్‌ తో చెప్పి ఖతం చేయిస్తా.. ఇలా ఓ అధికారి.. తోటి ఉద్యోగులను బెదిరించాడు. మహిళా ఉద్యోగులను కూడా దుర్భాషలాడాడు. ఈ ఆడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. తూర్పుగోదావరి జిల్లాలో ఓ అధికారి ఆడియో వైరల్‌గా మారింది. మహిళా ఉద్యోగులను దుర్భాషలాడుతూ, తోటి ఉద్యోగులపై బెదిరింపులకు దిగాడు ఉద్యోగి. దీంతో జిల్లా కలెక్టర్‌కు, స్థానిక మొబైల్‌ కోర్టుకు ఫిర్యాదు చేశారు వెలుగు ఉద్యోగులు.

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం వెలుగు డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే ఏపీడీ చిన్న శ్రీనివాస్‌ తోటి ఉద్యోగులను దుర్భాషలాడుతూ మాట్లాడిన ఆడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. తాను ఏం చేసినా అడ్డు చెప్పకూడదని, ఎవరైనా తన జోలికి వస్తే కోర్టుల చుట్టూ తిప్పిస్తానని, తన వెనుక రాజమండ్రిలో పెద్ద గ్యాంగ్‌ ఉందంటూ బెదిరింపులకు దిగాడు చిన్న శ్రీనివాస్‌. అంతేకాదు మహిళా ఉద్యోగులను దుర్భాషలాడాడు. ఇక్కడ జరిగిన విషయాలు బయటకు ఎందుకు లీక్‌ అవుతున్నాయని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మరోసారి ఇలాంటిది జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

ఏపీడీ చిన్న శ్రీనివాస్‌ వ్యవహార శైలిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, స్థానిక ఐటిడిఏ పీఏకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని రెండు రోజుల క్రితం కలెక్టర్‌ను ఆశ్రయించారు కిందిస్థాయి ఉద్యోగులు. మొబైల్‌ కోర్టుకు కూడా ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ జోక్యంతో ఏపీడీ చిన్న శ్రీనివాస్‌పై ఎంక్వైరీకి ఆదేశించారు ఐటిడిఏ అధికారులు.

ఇవి కూడా చదవండి:  Success Story: మేడపై మల్లె పూల సాగు.. లక్షల్లో సంపాదన.. లాక్‌డౌన్ సమయంలో ఓ మహిళ విజయ గాథ..

Women Should be Careful: మీ పక్కనే మృగాళ్లుంటారు.. మహిళలు బీ కేర్ ఫుల్.. సో.. బీ అలర్ట్ లేడీస్..