AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: పాముతో ఆసుపత్రికి వెళ్లిన యువకుడు.. ఆశ్చర్యపోయిన డాక్టర్లు.. అసలేమైందంటే.?

గుంటూరు జిల్లాలోని నందివెలుగు గ్రామానికి చెందిన వీరాంజనేయులును త్రాచుపాము కరిచింది. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స కోసం..

AP News: పాముతో ఆసుపత్రికి వెళ్లిన యువకుడు.. ఆశ్చర్యపోయిన డాక్టర్లు.. అసలేమైందంటే.?
Snake
Ravi Kiran
|

Updated on: Aug 19, 2021 | 11:54 AM

Share

గుంటూరు జిల్లాలోని నందివెలుగు గ్రామానికి చెందిన వీరాంజనేయులును త్రాచుపాము కరిచింది. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స కోసం బ్రతికున్న త్రాచుపాముతో సహా వచ్చాడు. దీంతో ఒక్కసారిగా ఆసుపత్రి సిబ్బంది ఆశ్చర్యానికి లోనయ్యారు.

వివరాల్లోకి వెళితే.. నందివెలుగుకు చెందిన వీరాంజనేయులు ఓ సిమెంట్ రాళ్ల పరిశ్రమలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. సిమెంట్ బ్రిక్స్‌ను లోడ్ చేసుకునేందుకు ట్రాక్టర్‌తో సహా నందివెలుగు వచ్చాడు. బ్రిక్స్‌ను ట్రాక్టర్లలో లోడు చేసేందుకు తీస్తూ ఉండగా అతడ్ని త్రాచుపాము కాటేసింది. వెంటనే కాటేసిన త్రాచుపామును డబ్బాలో బంధించాడు. తనతో పాటు వైద్యశాలకు తీసుకొచ్చాడు. అక్కడున్న వైద్య సిబ్బంది ఆశ్చర్యానికి గురి కాగా.. ఏ పాము కాటేసిందో వైద్యులు అడుగుతారని అందుకే పామును డబ్బాలో పెట్టుకుని తీసుకువచ్చినట్టు బదులిచ్చాడు.

కాగా, ప్రస్తుతం వీరాంజనేయులు ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. తనకు వైద్యం పూర్తికాగానే పామును జన సంచారం లేని ప్రాంతంలో వదిలేస్తానని వీరాంజనేయులు తెలిపాడు.

(టీవి 9 రిపోర్టర్ నాగరాజు, గుంటూరు జిల్లా)

చచ్చాంరా బాబోయ్...అసలే ఉప్పు తినొద్దంటుంటే అందులోనూ కల్తీనా?
చచ్చాంరా బాబోయ్...అసలే ఉప్పు తినొద్దంటుంటే అందులోనూ కల్తీనా?
కష్టాలను తట్టుకుని పట్టుదలే పెట్టుబడిగా.. పర్పుల్ డ్రీమ్స్‌తో..
కష్టాలను తట్టుకుని పట్టుదలే పెట్టుబడిగా.. పర్పుల్ డ్రీమ్స్‌తో..
రథ సప్తమి నుంచి వారి జీవితాల్లో కొత్త వెలుగులు..!
రథ సప్తమి నుంచి వారి జీవితాల్లో కొత్త వెలుగులు..!
వివాదాల సుడిగుండంలో టాక్సిక్ టీజర్
వివాదాల సుడిగుండంలో టాక్సిక్ టీజర్
ఫేక్.. ప్లాస్టిక్ కోడి గుడ్లను ఎలా గుర్తించాలో తెలుసా?
ఫేక్.. ప్లాస్టిక్ కోడి గుడ్లను ఎలా గుర్తించాలో తెలుసా?
వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై టోల్ చెల్లించాలంటే..
వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై టోల్ చెల్లించాలంటే..
హైదరాబాద్‌లో ఇల్లు కట్టాలంటే కొత్త రూల్స్.. 10 అంతస్తులు దాటితే..
హైదరాబాద్‌లో ఇల్లు కట్టాలంటే కొత్త రూల్స్.. 10 అంతస్తులు దాటితే..
తీపి తిన్నా షుగర్ పెరగదా? డయాబెటిస్ బాధితులకు బంపర్ గిఫ్ట్!
తీపి తిన్నా షుగర్ పెరగదా? డయాబెటిస్ బాధితులకు బంపర్ గిఫ్ట్!
మగవాళ్లకు ఫ్రీ బస్ స్కీమ్.. ఆడవారికి నెలకు రూ.2వేలు.. ఎక్కడో..
మగవాళ్లకు ఫ్రీ బస్ స్కీమ్.. ఆడవారికి నెలకు రూ.2వేలు.. ఎక్కడో..
ఈ టాలీవుడ్ హీరోయిన్ భర్త బలవంతంతోనే సినిమాలకు గుడ్ బై చెప్పిందా?
ఈ టాలీవుడ్ హీరోయిన్ భర్త బలవంతంతోనే సినిమాలకు గుడ్ బై చెప్పిందా?