దువ్వాడ దుమ్ముదుమారం.. శ్రీనివాస్ ఇంటికి వెళతా.. మాధురి సంచలన కామెంట్స్..
దువ్వాడ ఎపిసోడ్...కాస్త స్లో అయి మళ్లీ ఫ్లోలోకి వచ్చింది. కొత్త ఎపిసోడ్...నీ ఇంటికొస్తా, చెక్కులు తెస్తా అనే టీజర్‌తో మొదలైంది. రేపు దువ్వాడ ఇంటికి వెళతానన్నారు మాధురి. మరి ఇంట్లోకి రానివ్వాలంటూ అక్కడే ధర్నా చేస్తున్న వాణి ఏం చేస్తారు? మాధురిని అడ్డుకుంటారా? అనేది హాట్ టాపిక్ గా మారింది..
దువ్వాడ ఫైల్స్ మరోసారి వేడెక్కింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి తాను కూడా వెళతానని దివ్వల మాధురి పేర్కొన్నారు. ఇప్పటికే 10 రోజులకు పైగా దువ్వాడ ఇంటి ముందు ఆయన భార్య వాణి ధర్నా చేస్తున్నారు. తనను ఇంట్లోకి రానివ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. మాధురి దువ్వాడ ఇంటికి వెళ్తాననడంతో ఈ ఎపిసోడ్‌లో తాజాగా ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ నెలకొంది. వాణి, మాధురి ఒకరికొకరు ఎదురుపడితే… దువ్వాడ ఇంటి దగ్గర ఏం జరగనుంది. ఇక ఇంటి పంచాయితీకి తోడు తనకు దువ్వాడ 2 కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ మాధురి చూపిస్తున్న చెక్కులు కొత్త చిక్కులు తెచ్చేలా కనిపిస్తున్నాయి. ఇక మాధురి వల్ల దువ్వాడకు థ్రెట్ ఉందని వాణి ఆరోపించారు. మాధురి వల్ల తన భర్త శ్రీనివాస్‌కి ఏదైనా జరిగితే.. తాను, తన పిల్లలు రోడ్డున పడతామన్నారు.
దువ్వాడకు తన వల్ల కాదని, వాణీ వల్లే ప్రమాదం ఉందంటూ మాధురి కౌంటర్ ఇచ్చారు. దువ్వాడను చంపడానికి వాణి ట్రై చేస్తోందని ఆమె ఆరోపించారు. ఇంటి నిర్మాణం కోసం దువ్వాడకు తాను 2 కోట్ల రూపాయలు ఇచ్చానని, అదే ఇల్లు కావాలంటే..వాణి తనకు ఆ డబ్బుఇవ్వాలంటున్నారు మాధురి. తనకు డబ్బు ఇచ్చేదాకా దువ్వాడ ఇంటి దగ్గర కూర్చుంటానంటూ మాధురి పేర్కొన్నారు.
వీడియో చూడండి..
చెక్కులతో దువ్వాడ ఇంటికి మాధురి వెళితే ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే కాంట్రోవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారిన దువ్వాడ ఇల్లు, మరోసారి రెండు వర్గాల ఆందోళనతో దద్దరిల్లేలా ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..