AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maddikera: రాజా పోకడలు..! గుర్రపు స్వారీలతో రాజ వంశస్థుల దసరా వేడుకలు..

ఈ గుర్రాలపై స్వారీ చేయడం కోసం ఈ కుటుంబాలకు చెందిన వారు రెండు నెలల నుండి గుర్రాలపై ట్రైనింగ్ తీసుకుంటారు.  ఇటీవల ఓ యువకుడు గుర్రపు స్వారీ చేస్తుండగా జారీ కిందపడి చనిపోయిన సంఘటన  చోటు చేసుకుంది. అయిన ఈ యాదవ వంశీయులు తమ పూర్వికుల నుండి వస్తున్న ఈ సంప్రదాయం మాత్రం వదలబోము అంటున్నారు.

Maddikera: రాజా పోకడలు..! గుర్రపు స్వారీలతో రాజ వంశస్థుల దసరా వేడుకలు..
Dussehra festival celebration
J Y Nagi Reddy
| Edited By: Jyothi Gadda|

Updated on: Oct 14, 2024 | 7:36 AM

Share

ఆదోని, గుత్తిలలో టిప్పు సుల్తాన్ సైన్యం పై తమ కుటింబీకులైన యాదవ వంశీయులు గుర్రాలతో వెంబడించి తిప్పుసుల్తాన్ సైన్యంని తరిమి కొట్టి వారిపై విజయం సాధించగా ఆ విజయానికి గుర్తుగా మేము విజయదశమి రోజు మా యాదవ కుటుంబాలైన చిన్న నగరి, పెద్దనగరి, యమనగేరి కుటుంబాలకు చెందిన వారు ప్రతి సంవత్సరం విజయదశమి రోజున గుర్రాలపై స్వారీ చేస్తామని, యాదవ రాజుల కుటింబీకులు మాత్రమే ఈ గుర్రపు స్వారీ లో పాల్గొనటం జరుగుతుందని అంటున్నారు యాదవ వంశీయులు.

ప్రతి సంవత్సరం దసరా రోజు తమ కుటుంబాలకు చెందిన వారు బొజ్జనాయని పేట గ్రామంలో మా పూర్వికులు నిర్మించిన బొజ్జేశ్వరుని దర్శించుకుని అక్కడి నుండి గుర్రాలపై పారువేటగా బయలు దేరి మద్దికెర జమ్మి చెట్టు వరకు ఎవ్వరు ముందుగా వస్తారో వారే విజేతలు.  గెలిచిన వారిని గ్రామంలో రాజరిక ఆచార సంప్రదాయం ప్రకారం రాజుల డ్రెస్ వేయించి, ఖడ్గం చేతిలో పట్టుకుని గుర్రం పై గ్రామం నడిబొడ్డున బ్యాండ్ మేళంతో ఊరేగింపు చేయడం ఇక్కడి ఆచారం అంటున్నారు యాదవ రాజా వంశీయులు.

ఈ వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

అయితే, ఈ గుర్రాలపై స్వారీ చేయడం తలకి మించినదే ఎందుకంటే ఈ గుర్రాలపై స్వారీ చేయడం కోసం ఈ కుటుంబాలకు చెందిన వారు రెండు నెలల నుండి గుర్రాలపై ట్రైనింగ్ తీసుకుంటారు.  ఇటీవల ఓ యువకుడు గుర్రపు స్వారీ చేస్తుండగా జారీ కిందపడి చనిపోయిన సంఘటన  చోటు చేసుకుంది. అయిన ఈ యాదవ వంశీయులు తమ పూర్వికుల నుండి వస్తున్న ఈ సంప్రదాయం మాత్రం వదలబోము అంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..