AP Rains: వానలు వచ్చేస్తున్నాయ్.. ఏపీకి వచ్చే 4 రోజులు అతి భారీ వర్షసూచన
ఆంధ్రప్రదేశ్‌ను వానగండం వెంటాడుతుంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో నాలుగు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ముందుజాగ్రత్తగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌ను వానగండం వెంటాడుతుంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో నాలుగు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ముందుజాగ్రత్తగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం మరికొన్ని గంటల్లో అల్పపీడనంగా మారనుంది. అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయంది. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. భారీ వర్షసూచనతో తిరుపతి, నెల్లూరు కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. అధికారులతో వర్చువల్ సమీక్ష నిర్వహించారు.
మూడు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తమిళనాడులో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, వేలూరులో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెన్నై సహా ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఎల్లుండి కుండపోత వర్షాలు పడే అవకాశం ఉంది.
ఇది చదవండి: గుడ్‌న్యూస్.! ఏపీకి తొలి వందే మెట్రో.. ఏ రూట్‌లోనంటే.?
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..