AP News: ఈ అమ్మ బంగారం..!
పండుగ ఉత్సవాల్లో దేవతా మూర్తులను అలంకరించేందుకు భక్తులు పోటీ పడుతుంటారు. కరెన్సీతో, పండ్లతో, కూరగాయలతో అలకరించి తమ భక్తిని చాటుకుంటారు.దసరా సందర్భంగా అమ్మవారి విగ్రహాలకు కొత్త హంగులు కూర్చి సంబరాలు చేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆ ఉత్సవాలు గూర్చి తెలుసుకుందాం..

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు ప్రతి ఏటా ఘనంగా జరుగుతున్నాయి. విజయదశమి రోజున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు బంగారు చీరతో భక్తులకు దర్శనమిచ్చారు… అమ్మవారిని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చి దర్శించుకుంటున్నారు. పూజలు నిర్వహించి అర్చకులు అందిస్తున్న తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తమిళనాడు కళాకారులతో రూ.10 లక్షలు ఖర్చు చేసి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి బంగారు చీరను తయారు చేయించినట్లుగా ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం ఉత్సవ విగ్రహంతో పట్టణంలో గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో మహిళలు నిర్వహించిన కోలాటం భక్తుల్ని విశేషంగా ఆకర్షించింది.