Andhra: ములక్కాయలు చూస్తే కొనే మూడ్ పోతుంది.. ఎందుకంటే..!
కార్తీకం ముగిసినా కూరగాయల రేట్లు తగ్గేలా కనిపించడం లేదు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి–తూర్పు గోదావరి జిల్లాల్లో మునగకాయలు కొండెక్కి కూర్చున్నాయి. తుఫాన్‌లు, చెట్ల విరిగిపోవడం వల్ల పంట దెబ్బతినడంతో హోల్‌సేల్ మార్కెట్‌లోనే కిలో రూ.350 పలుకుతోంది. కిలోకి పది ములక్కాడలు మాత్రమే రావడంతో ఒక్కో మునగకాయ రిటైల్ మార్కెట్లో....

మునగకాయలు.. పోషకాలు, ఔషధ గుణాలు కలిగి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీరానికి కావాల్సిన శక్తిని ఇవ్వటంలో ఇవి అత్యంత ప్రభావవంతంగా పని చేస్తాయి. శరీరానికి అవసరమైన ఐరన్, కాల్షియం, విటమిన్ C పుష్కలంగా వీటివల్ల లభిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించే శక్తివంతమైన సహజ టానిక్‌గా ఇది పని చేస్తుందని చెబుతారు. జీర్ణక్రియను సులభం చేసే మృదువైన ఫైబర్, ఎముకలకు బలాన్ని ఇచ్చే సహజ గుణాలు, చర్మం మెరిసేలా సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఉన్నాయి . అందుకే సాంబార్‌లో వేయడం మాత్రమే కాదు కూర, ఫ్రై రూపంలోనూ ఆహారంగా తీసుకుంటాము. ఐతే ఇపుడు మునగకాయలు మార్కెట్‌లో కొండెక్కి కూర్చున్నాయి. హోల్‌సేల్ మార్కెట్లో ప్రస్తుతం కిలో 350 రూపాయలు ధర పలుకుతుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో మునగ పంట సరిగ్గా కాయకపోవడంతో.. ధర అమాంతం పెరిగిపోయింది. దీంతో ఒక్కో కాయ రూ . 40ల వరకు పలుకుతుంది.
ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కూరగాయలు ధరలు కొండెక్కి కూర్చోడం మనం చూస్తూ ఉంటాం. కానీ కార్తీక మాసం పూర్తయ్యాక కొన్ని కూరగాయల ధరలు తగ్గినప్పటికీ.. మరికొన్నింటి రేట్లు మాత్రం మండిపోతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ మండలం దొంగరావిపాలెం మార్కెట్ హోల్‌సేల్ కూరగాయల అమ్మకానికి పెట్టింది పేరు. ఉభయ గోదావరి జిల్లాలోని పట్టణాలకు ఇక్కడ నుంచే కూరగాయలు ఎగుమతి అవుతూ ఉంటాయి. ఈ సంవత్సరంలోనే ఎన్నడూ లేని విధంగా కూరగాయల ధరలు ఇటీవల పెరిగాయి. అయితే ఇక్కడ కిలో ములక్కాడలు రూ. 350 పలకడంతో అందరూ ఆశ్చర్యపోతున్న పరిస్థితి ఉంది. కిలోకి 10 ములక్కాడలు తూగుతాయి. అంటే హోల్‌సేట్ మార్కెట్‌లో రూ. 35 పడుతుంది. దీంతో ఒక్కో ములక్కాడ రిటైల్ మార్కెట్‌లో రూ 40 నుంచి 50 అమ్ముతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఇటీవల తుఫాన్‌లకు.. చెట్లు విరిగిపోయి మునగ పంట కాపు డ్యామేజ్ అవ్వడంతో.. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినందుని హోల్‌సేల్ వ్యాపారస్తులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
