AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెట్‌ లవర్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై మీ పెట్స్‌ను పక్కింటి వారికి ఇవ్వాల్సి అవసం లేదు.. ఇక్కడ ఇస్తే చాలు..

పెంపుడు జంతువులను పెంచుకునే వారికి ఇదొక గుడ్‌న్యూస్.. ఇకపై మీరు ఎదైనా టూర్స్‌ కానీ, ఊర్లకు కాని వెళితే, మీ పెట్స్‌ను తీసుకెళ్లడమో, పక్కింటి వాళ్లకు ఇచ్చి వెళ్లాల్సిన అవసరం లేదు. వీళ్లకు అప్పజెపితే చాలు మీరు మళ్లీ తిరిగి వచ్చేంత వరకు వాళ్లే దాన్ని వాటిని జాగ్రత్తగా చూసుకుంటారు. మీరు వచ్చిన తర్వాత వాటిని మళ్లీ మీకు తిరిగి ఇస్తారు. ఇంతకి ఏంటీ సర్వీస్ అనుకుంటున్నారా.. అయితే తెలుసుకుందాం పదండి..

పెట్‌ లవర్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై మీ పెట్స్‌ను పక్కింటి వారికి ఇవ్వాల్సి అవసం లేదు.. ఇక్కడ ఇస్తే చాలు..
Pet Zones
T Nagaraju
| Edited By: Anand T|

Updated on: Jul 17, 2025 | 10:38 AM

Share

పెంపుడు జంతువుల పట్ల మక్కువ పెరిగిపోతుంది. కుటుంబ సభ్యులతో సమానంగా డాగ్స్ ను పెంచుకుంటున్నారు. కుక్కల కోసం ప్రత్యేక ఆహారం, స్పెషలిస్ట్ వైద్యులు, పార్లర్ల ఏర్పాటు వంటివి ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు. అయితే డాగ్స్‌ను ఇష్టంగా పెంచుకుంటున్న వారికి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. రెండు మూడు రోజుల పాటు పర్యాటక కేంద్రాలకు వెళ్ళాలన్నా, నాలుగైదు గంటలు పాటు ఫంక్షన్‌కు వెళ్ళాలన్నా సమస్యలు తప్పడం లేదు.‌ ఎంతో అభిమానంతో పెంచుకునే డాగ్స్ ఇతరులకు అప్పిగించి వెళ్ళాల్సిన పరిస్థితి. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొనే కొంతమంది డాగ్ జోన్స్ నిర్వహిస్తున్నారు. గుంటూరు నగరంలో డాగ్స్ కోసం ప్రత్యేక హాస్టల్స్ వెలిశాయి‌

హాస్టల్స్‌లో గంటలు, రోజులు, నెలల తరబడి తమ పెట్స్‌ను ఉంచవచ్చు. పెట్స్ కోసం ప్రత్యేక ఎన్ క్లోజర్స్ ఉంటాయి.‌ అక్కడ రెస్ట్ తీసుకునేలా ఏర్పాట్లు ఉంటాయి. పెట్స్ ఆడుకునేందుకు ఆట వస్తువులు అందుబాటులో ఉంచుతారు. మూడు పూటలా ఆహారాన్ని అందిస్తారు. ఆహారాన్ని ఇచ్చేటప్పుడు వీడియోలు తీసి యజమానులకు వాట్సాప్‌లో పంపుతారు. డాగ్స్ యజమానిపై బెంగపెట్టుకోకుండా చూసుకునేందుకు కేర్ టేకర్లు అందుబాటులో ఉంటారు. డాగ్స్ కు వైద్యం చేయించేందుకు చర్యలు తీసుకుంటారు.

నాలుగైదు నెలల పాటు ఇతర దేశాలకు వెలుతున్న వాళ్ళు తమకిష్టమైన పెట్స్ ను ఈ హాస్టల్స్ ఉంచేందుకు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే హాస్టల్స్ లో పూర్తిగా ఏసి సౌకర్యం కల్పిస్తున్నారు. వీటికి తోడుగా పార్లర్లను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి టూర్స్‌, విదేశాలకు వెళ్లే పెట్‌ లవర్స్‌కు ఇది అదిరిపోయే అవకాశమే అని చెప్పవచ్చు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.