యువకుడు ఆత్మహత్య.. సీఐ కొట్టడంతో చనిపోయాడని ఆందోళన.. ఇంతకీ ఏం జరిగిందంటే
సీఐ కొట్టడం వల్లే తమ కుమారుడు చనిపోయాడంటూ మృతుడి బంధువులు ఆందోళన చేపట్టారు. మృతదేహంతో నిరసన(Protest) చేశారు. సీఐ వచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. విషయం తెలుసుకున్న...
సీఐ కొట్టడం వల్లే తమ కుమారుడు చనిపోయాడంటూ మృతుడి బంధువులు ఆందోళన చేపట్టారు. మృతదేహంతో నిరసన(Protest) చేశారు. సీఐ వచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ.. ఘటనాస్థలానికి చేరుకుని నిరసనకారులతో మాట్లాడారు. వారిని ఒప్పించి, ఎట్టకేలకు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట(Mandapeta) కు చెందిన కాళీకృష్ణ భగవాన్ హైదరాబాద్(Hyderabad) లో ఉద్యోగం చేసి, కొన్నాళ్లుగా తండ్రి వద్దే ఉంటూ వ్యవసాయంలో సహకరిస్తున్నాడు. అతనికి అదే ప్రాంతానికి చెందిన బాలికతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో మండపేట టౌన్ సీఐ దుర్గాప్రసాద్.. కాళీని ఆదివారం స్టేషనుకు పిలిపించి, విచారణ చేపట్టారు. అయితే విచారణ చేస్తున్న సమయంలో కాళీని పోలీసులు కొట్టారని, మర్మావయవాల వద్ద గాయాలయ్యాయని కాళీ బంధువులు ఆరోపించారు. ఒక రోజంతా ఒళ్లు నొప్పులతో బాధపడటంతో స్థానిక వైద్యుడికి చూపించామని, మంగళవారం ఉదయం ఇంటినుంచి బయటకు వెళ్లి, తిరిగి రాలేదు. అతని కోసం వెతకగా ఏడిద రోడ్డులో విగతజీవిగా పడి ఉన్నట్లు గుర్తించామని చెప్పారు.
కాళీ చనిపోయాడన్న విషయం తెలుసుకున్న బంధువులు.. మృతదేహాన్ని కలువపువ్వు సెంటరుకు తీసుకొచ్చారు. అక్కడ ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేసేవరకూ కదిలేది లేదని, సీఐని సంఘటన స్థలానికి పిలిపించాలని రాత్రి వరకు నిరసన కొనసాగించారు. సాయంత్రం 5.30 సమయంలో సంఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ బాలచంద్రారెడ్డి బాధితులతో చర్చించారు. సీఐని పిలిపించాలని బాధితులు పట్టుబట్టారు. ఇంతలో వైకాపా, జనసేన నాయకులూ అక్కడకు చేరుకున్నారు. బాధితులు ఎవరిపై ఫిర్యాదు చేస్తే వారిపై కేసు నమోదు చేస్తామని డీఎస్పీ వివరించారు. దాంతో సీఐ దుర్గాప్రసాద్, ఓ కానిస్టేబుల్, బాలిక తల్లిదండ్రులతో పాటు కళాశాల ప్రిన్సిపల్‌పై ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేయనున్నట్లు డీఎస్పీ బాలచంద్రారెడ్డి తెలిపారు.
Also Read
Chanakya Niti: ఈ ఐదుగురి వ్యక్తులతో శత్రుత్వం చాలా ప్రమాదం అంటున్న చాణక్య