Goa Assembly Elections: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందే క్యాంప్‌ పాలిటిక్స్.. రిసార్ట్‌కు కాంగ్రెస్ అభ్యర్థులు!

Goa Camp Politics: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. కొన్ని ఎగ్జిట్ పోల్స్‌లో కూడా బీజేపీ అధికారంలోకి రాగలదని చెబుతున్నారు.

Goa Assembly Elections: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందే క్యాంప్‌ పాలిటిక్స్.. రిసార్ట్‌కు కాంగ్రెస్ అభ్యర్థులు!
Goa
Follow us

|

Updated on: Mar 09, 2022 | 9:20 AM

Goa Assembly Election 2022: ఎగ్జిట్ పోల్స్(Exit polls) గోవా ఎన్నికల ఫలితాలకు ముందు అన్ని పార్టీలు జాగ్రత్తలు పాటిస్తున్నాయి. ఇందులో కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP) మధ్య గట్టి పోటీ నెలకొంది. కొన్ని ఎగ్జిట్ పోల్స్‌లో కూడా బీజేపీ అధికారంలోకి రాగలదని చెబుతున్నారు. ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్‌ గోవా రాజకీయ నేతలను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాయి. గోవాలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందే క్యాంప్‌ పాలిటిక్స్ మొదలయ్యాయి. హంగ్‌ వస్తుందన్న భయంతో కాంగ్రెస్ అభ్యర్థుల్ని రిసార్ట్‌కు తరలించారు.

గోవా రాజకీయాలు రంజుగా మారాయి. ఎగ్జిట్‌పోల్స్‌ హంగ్‌ అసెంబ్లీని సూచించడంతో అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. అప్పుడే క్యాంప్‌ రాజకీయాలు మొదలయ్యాయి. కాంగ్రెస్‌ అభ్యర్ధులను రిసార్ట్‌కు తరలించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధించినప్పటికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది కాంగ్రెస్. ఈసారి కూడా అదే జరుగుతుందన్న భయం కాంగ్రెస్‌ను వెంటాడుతోంది. అందుకే 40 మంది అభ్యర్ధులను నార్త్‌ గోవా లోని రిసార్ట్‌కు తరలించారు. కాంగ్రెస్‌ క్యాంప్‌ బాధ్యతను ట్రబుల్‌ షూటర్‌ డీకే శివకుమార్‌కు అప్పగించారు. గతంలో జరిగిన పొరపాటు రిపీట్‌ కాకుండా చూస్తామన్నారు డీకే శివకుమార్‌.

40 స్థానాలున్న గోవా అసెంబ్లీలో 20 స్థానాలు గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అయితే ఏ పార్టీకి కూడా మెజారిటీ వచ్చే అవకాశం లేదని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేశాయి. రెండు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. కాంగ్రెస్‌కు 16-20 స్థానాలు వచ్చే అవకాశముందని కొన్ని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. గోవాలో కాంగ్రెస్‌కు 17-19 , బీజేపీకి 11-13, ఆప్‌కు 1-4 స్థానాలు వచ్చే అవకాశముందని టీవీ9-పోల్‌స్ట్రాట్‌ ఎగ్జిట్‌ పోల్‌ అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో ఆప్‌ కింగ్‌మేకర్‌గా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీయేతర పార్టీలను సంప్రదిస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. చిన్న పార్టీల నేతలతో కూడా కాంగ్రెస్‌ టచ్‌లో ఉంది. ఎంజీపీ పార్టీని అటు కాంగ్రెస్‌ ,ఇటు బీజేపీ నేతలు సంప్రదించారు. కాంగ్రెస్‌ అభ్యర్ధులతో పార్టీ మారబోమని గతంలోనే ప్రతిజ్ఞ చేయించారు రాహుల్‌గాంధీ. ఈనెల 10వ తేదీన గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ మాత్ర బీజేపీనే మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలావుంటే, సీఎం ప్రమోద్ సావంత్ పై సావంత్ దాడి ఎగ్జిట్ పోల్స్ అబద్ధమని, ఎగ్జిట్ పోల్స్ ఏమైనా చూపించగలవని అన్నారు. గోవాలో మెజారిటీతో మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న పూర్తి విశ్వాసం మాకుందన్నారు. మార్చి 10న ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తాయని చెప్పారు. ఈసారి కాంగ్రెస్‌తో బీజేపీకి ప్రత్యక్ష పోటీ ఉన్నందున, కాంగ్రెస్‌లో ఎప్పుడూ భయం ఉందని, ఈసారి తాము ఎంచుకున్న అభ్యర్థులపై ఎక్కడో ఒక చోట ఉన్నారని ప్రమోద్ సావంత్ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. పారిపోకూడదని రిసార్ట్ రాజకీయాలు ప్రారంభించారు. గోవా కాంగ్రెస్ తమ అభ్యర్థులను రిసార్ట్‌కు పంపినట్లు ఆయన విమర్శించారు. కాగా, అంతకు ముందు ఢిల్లీలో మోడీతో భేటీ అయిన సావంత్.. గోవాలో బీజేపీ పటిష్ట పనితీరు గురించి ప్రధాని మోడీకి తెలియజేసినట్లు సావంత్ చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో గోవాలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం మాకు లభిస్తుందన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో ప్రజల ప్రయోజనాల కోసం నిరంతరం కృషి చేస్తాం.

Read Also…

Digital India Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! డిజిటల్‌ ఇండియాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. పూర్తివివరాలివే!