5 కోట్ల మందికి జీవనాడి.. ధర్మ యుద్ధంలో గెలిచిన అమరావతి రైతులు.. పవన్ కల్యాణ్
రైతులు భూములు మాత్రమే ఇవ్వలేదు.. రాష్ట్రానికి భవిష్యత్తునిచ్చారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతి రైతులు ఐదేళ్లుగా లాఠీదెబ్బలు తిని నలిగిపోయారన్న పవన్, అమరావతి రైతుల కన్నీళ్లు తుడిచే సమయం వచ్చిందన్నారు. అమరావతి ఐదు కోట్ల మందికి సంబంధించిన హబ్.. గత ప్రభుత్వం అమరావతి భవిష్యత్తును తుడిచిపెట్టిందన్నారు. ధర్మయుద్ధంలో అమరావతి రైతులు విజయం సాధించారన్నా పవన్ కల్యాణ్.

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం త్యాగం చేసిన అమరావతి రైతులు ఐదేళ్ళలో నలిగిపోయారు, రాజధాని లేదన్న నేతలపై పోరాడి గెలిచారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని పవన్ మాటిచ్చారు. లాఠీదెబ్బలు, ముళ్లకంచెల మధ్య ఇబ్బందిపడ్డారు. ఇచ్చిన మాటకు కట్టుబడి.. అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పవన్. అమరావతి రైతుల త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోలేమన్నారు.
గత ఐదేళ్లలో సుమారు 2 వేల పైచిలుకు రైతులు ప్రాణాలు కోల్పోయారన్నారు. అమరావతి రైతుల త్యాగాలను గుర్తించిన మోదీ.. అమరావతి పున: ప్రారంభానికి విచ్చేశారన్నారు. ఏపీ ప్రజల 5 కోట్ల మందికి అమరావతి జీవనాడి అన్న పవన్.. గత ప్రభుత్వంలో అమరావవతి అంటే పరాదాలు, సెక్షన్లు గుర్తుకు వచ్చేలా చేశారన్నారు. అయితే రైతులు ఈ ధర్మ యుద్ధంలో విజయం సాధించారని పవన్ కళ్యాణ్ తెలిపారు. 5 కోట్ల మంది ప్రజల తరఫున రైతులు, మహిళలు, విద్యార్థులు తిన్న గాయాలు మదిలో ఉన్నాయన్నారు. అమరావతి ప్రజల త్యాగాలను మేం మర్చిపోమన్న పవన్.. మీ ఆశలకు అనుగుణంగా అమరావతి నిర్మాణం ఉంటుందన్నారు.
కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోవడం యావత్ భారతదేశాన్ని కలచివేసిందన్నారు పవన్. ఇంత ఇబ్బందుల్లో కూడా ప్రధాని ఇక్కడికి రావడం ఏపీ ప్రజల అదృష్టం అన్నారు. అమరావతి రైతుల త్యాగాలను ప్రధాని గుర్తించారన్నారు. మోదీకి భవానీ అమ్మ ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నామని పవన్ కళ్యాణ్ అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..