Bukkapatnam: 30 ఏళ్లు దాటినా పెళ్లి అవ్వడం లేదని గ్రామ వాలంటీర్ ఆత్మహత్య

పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్లను అడిగాడు.. బ్రతిమాలాడు.. ఇదే విషయంపై గొడవ కూడా పెట్టుకున్నాడు. కానీ అప్పుల తీరే ఆగమని తల్లిదండ్రులు సమాధానం చెప్పారు. దీంతో తనకు ఇక పెళ్లి కాదేమో అని మదనపడ్డాడు. నైరాశ్యంలోకి వెళ్లాడు.

Bukkapatnam: 30 ఏళ్లు దాటినా పెళ్లి అవ్వడం లేదని గ్రామ వాలంటీర్ ఆత్మహత్య
Prabhakar
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 01, 2023 | 5:16 PM

శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో విషాదం చోటుచేసుకుంది. వివాహం కావడం లేదని మనస్తాపం చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బుక్కపట్నానికి చెందిన ప్రభాకర్ గ్రామ వాలంటీర్‌గా పని చేస్తున్నాడు. 30 సంవత్సరాలు దాటినా వివాహం కాకపోవడంతో పెళ్లి కాలేదని నిత్యం మదన పడుతుండేవాడు. తనకు వివాహం చేయాలని తల్లిదండ్రులను అడిగేవాడు. అయితే కొన్ని అప్పులు ఉన్నాయని.. అవి తీరాక సంబంధాలు చూస్తామని ఇంట్లో వాళ్లు చెబుతుండేవారు.

దీంతో ప్రభాకర్ తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లాడు. తనకు ఇక పెళ్లి కాదేమో అని ఆవేదన చెందాడు.  ఆ బాధతోనే బుధవారం సాయంత్రం గ్రామానికి సమీపంలోని పొలాల్లోకి వెళ్లి విషం తాగాడు. స్థానికులు గుర్తించి అపస్మారక స్థితిలో పడి ఉన్న ప్రభాకర్‌ను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రభాకర్ మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఏ సమస్యకి అయినా కచ్చితంగా పరిష్కారం ఉంటుంది. ఈ రోజు భరించలేము అనిపించిన విషయం.. రేపటికి కాస్త వెయిట్ తగ్గుతుంది. కాలమే ఆ సమస్యకి పరిష్కారం చూపిస్తుంది. విలువైన జీవితాన్ని ఇలా అర్థాంతరంగా ముగించి.. అయినవాళ్లకు కన్నీళ్లు మిగల్చవద్దు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?