Cyclone Remal: అలర్ట్.. తీరం వైపు దూసుకువస్తున్న రెమాల్‌.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది రేపటికి తుఫాన్‌గా బలపడనుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ తుఫాన్‌‌కు రెమాల్‌ తుఫాన్‌గా నామకరణం చేసింది. శనివారం సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా మారనున్న రెమాల్.. ఆదివారం బెంగాల్, బంగ్లాదేశ్‌ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Cyclone Remal: అలర్ట్.. తీరం వైపు దూసుకువస్తున్న రెమాల్‌.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
Cyclone Remal
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 24, 2024 | 1:33 PM

బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది రేపటికి తుఫాన్‌గా బలపడనుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ తుఫాన్‌‌కు రెమాల్‌ తుఫాన్‌గా నామకరణం చేసింది. శనివారం సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా మారనున్న రెమాల్.. ఆదివారం బెంగాల్, బంగ్లాదేశ్‌ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్ నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది. బెంగాల్, ఉత్తర ఒడిశా, మిజోరాం, త్రిపుర, మణిపూర్‌పై తుఫాన్‌ ఎఫెక్ట్‌ చూపించనుంది. తీరందాటే సమయంలో భారీ వర్షాలతోపాటు గంటకు 102 కి.మీ.వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు..

మధ్య బంగాళా ఖాతంలో వాయుగుండం కేంద్రీకృతం అయిందని దీని ప్రభావంతో రెండు రోజులపాటు ఏపీలో సైతం భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి సునంద తెలిపారు. వాయుగుండం ఈశాన్య దిశగా కదులుతూ బలపడుతోందని.. 25 ఉదయం తుఫానుగా మారబోతోందని తెలిపారు. ఉత్తర దిశగా ప్రయాణిస్తు 26నాటికీ తీవ్ర తుఫానుగా మారి.. 26 అర్ధరాత్రి నాటికి బంగ్లాదేశ్ – వెస్ట్ బెంగాల్ మధ్య తీవ్ర తుఫాను తీరం దాటుతుందన్నారు. ఏపీ కోస్తా తీరానికి తుఫాను ప్రభావం ఉండదని స్పష్టంచేశారు. క్లౌడ్ బ్యాండ్స్ కారణంగా అక్కడక్కడ చెదురు మదురు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి సునంద తెలిపారు.

తమిళనాడులో భారీ వర్షాలు..

ఇదిలాఉంటే.. తుఫాన్ ప్రభావంతో దక్షిణాదిలోని కేరళ, తమిళనాడు, కర్నాటక, పుదుచ్చెరీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలకు ముందు కురుస్తున్న వర్షాలతో దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. రేపటి వరకు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వివరించింది. మరోవైపు దక్షిణాదిలో వర్షాల కారణంగా నలుగురు మృతి చెందారు.. తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 4 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. ఈరోడ్‌ జిల్లాలో పలు గ్రామాలు నీట మునిగిపోవడంతో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. సేలంలో ఐదు ఇళ్లులు నేలకూలడంతో ఇద్దరు మృతి చెందారు. కన్యాకుమారి, తేంకాశీ జలపాతాల మూసివేశారు అధికారులు. ఎక్కడికక్కడ వాగులు, వంకలు పొంగుతున్నాయి. కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. తిరువనంతపురం, కొచ్చిన్, త్రిశ్శూర్, కోజికోడ్‌ సహా పలు ప్రధాన నగరాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎర్నాకుళం, త్రిశ్శూర్‌ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ కూడా జారీ అయింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!