Cyclone Remal: రాకాసి అలలు.. గంటకు 140కిలోమీటర్ల వేగంతో గాలులు.. ఉప్పాడలో పరిస్థితి ఎలా ఉందంటే..
బెంగాల్‌పై రెమాల్ తుఫాన్ పంజా విసిరింది. ఎటు చూసినా ఈదురుగాలులు అతలాకుతలం చేస్తున్నాయి. తీరం దాటే సమయంలో తీవ్ర తుఫాన్‌గా మారిన రెమాల్... బెంగాల్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. గంటకు 140 కిలోమీటర్ల వరకూ గాలులు బీభత్సం సృష్టించాయి. సముద్రంలోని కెరటాలు సాధారణం కంటే 8-10 అడుగుల ఎత్తులో ఎగసిపడ్డాయి. రెమాల్ ఎఫెక్ట్‌తో బెంగాల్‌లో చాలాచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.
బెంగాల్‌పై రెమాల్ తుఫాన్ పంజా విసిరింది. ఎటు చూసినా ఈదురుగాలులు అతలాకుతలం చేస్తున్నాయి. తీరం దాటే సమయంలో తీవ్ర తుఫాన్‌గా మారిన రెమాల్… బెంగాల్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. గంటకు 140 కిలోమీటర్ల వరకూ గాలులు బీభత్సం సృష్టించాయి. సముద్రంలోని కెరటాలు సాధారణం కంటే 8-10 అడుగుల ఎత్తులో ఎగసిపడ్డాయి. రెమాల్ ఎఫెక్ట్‌తో బెంగాల్‌లో చాలాచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు కోల్‌కతాలో వరదనీరంతా రోడ్లపై నిలిచిపోయింది. చాలాచోట్ల కాలనీల్లో చెట్లు విరిగి.. రోడ్లకు అడ్డంగా పడిపోయాయి. సుందర్‌బన్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సహాయక చర్యల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బలగాలు, ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్‌గార్డ్ బృందాలు పాల్గొంటున్నాయి. ఇప్పటికే కిలోమీటర్ల పొడవునా కూలిన చెట్టను తొలగించే పనిలో నిమగ్నమైంది ఎన్డీఆర్‌ఎఫ్ టీమ్.
ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు రెస్క్యూ టీమ్. అటు తుఫాన్ ప్రభావంతో ఇప్పటి వరకు 394 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. తుఫాను తీవ్రతకు బెంగాల్ తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారడంతో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశాలిచ్చారు. తీరం వెంబడి భారీ వేగంతో గాలులు అతలాకుతలం చేశాయి. అయితే, బంగ్లాదేశ్ – వెస్ట్ బెంగాల్ సాగర్ ఐలాండ్ మధ్య తుఫాను తీరం దాటడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. మరో రెండు రోజులపాటు అస్సోం, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ , నాగాలాండ్ రాష్ట్రాల్లో తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
వీడియో చూడండి..
ఉప్పాడలో రెమాల్ తుఫాన్ బీభత్సం.. అలల ధాటికి పది ఇళ్లు నేలమట్టం
రెమాల్ తుఫాన్ ఎఫెక్ట్‌తో మూడు రోజులుగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. ముఖ్యంగా ఉప్పాడ దగ్గర మూడు రోజులుగా రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. రక్షణ గోడపై నుంచి రోడ్డుపైకి అలలు దూసుకువస్తున్నాయి. సుబ్బంపేట నుంచి SPGL శివారు వరకు అలలు బీచ్ రోడ్డు పైకి వస్తున్నాయి. SPGL సమీపం దగ్గరున్న వంతెన పైనుంచి కెరటాలు ఎగసిపడుతుండటంతో వాహనదారులు భయ బ్రాంతులకు గురవుతున్నారు.
తుఫాన్ ధాటికి పది ఇళ్లు నేలమట్టమయ్యాయి. తీరంలో ఉన్న ఇళ్లు కోతకు గురవుతున్నాయి. సూరాడపేట, మాయాపట్నంలో ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..