Weather Update: తెలుగు రాష్ట్రాలపై తుఫాన్ దిత్వ ఎఫెక్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, స్కూళ్లకు సెలవులు
Cyclone Ditwa Updates: శ్రీలంకను తుడిచేసి, తమిళనాడును ముంచేసిన దిత్వా తుఫాన్ ఇప్పుడు ఏపీ దిశగా దూసుకొస్తోంది. ఈ తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వర్ష ప్రభావిత జిల్లాల్లోని స్కూల్‌లు, పాఠశాలలకు సెలువు కూడా ప్రకటించారు అధికారులు. ఇక దిత్వా ఎఫెక్ట్ ఏపీ పైనే కాకుండా తెలంగాణ పై కూడా కొనసాగుతుంది. ఈ ప్రభావంతలో తెలంగాణలోనూ పలు జిల్లాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అటు శ్రీలంకను ముంచెత్తిన దిత్వా తుఫాన్ ఏపీవైపు దూసుకొస్తుంది. ఇది ప్రస్తుతం బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరంలో చెన్నైకి 140, పుదుచ్చేరికి 90 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. ఈ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో పాటు పలు జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. ప్రకాశం, గుంటూరు జిల్లాలకు ఫ్లాష్‌ప్లడ్ అలర్ట్ జారీ చేసింది.
దిత్వా ఎఫెక్ట్.. ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవులు
అయితే తుఫాను ప్రభావంతో సోమవారం తెల్లవారుజాము నుంచే నెల్లూరు సహా అనేక జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నెల్లూరులోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు జిల్లా కలెక్టర్లు. అటు తిరుపతి జిల్లాలో సోమవారం విద్యా సంస్థలు.. స్కూళ్లు, కళాశాలలు, అంగన్‌వాడీలకు సెలవు ప్రకటించారు అధికారులు. అన్నమయ్య జిల్లాలో కూడా స్కూళ్లు, కళాశాలలు మూతబడనున్నాయి. ఇక రాష్ట్రంలో కాస్తా తేలికపాటి వర్షాలు కురిసే జిల్లాలో ఇప్పటి వరకు ఇంకా సెలవులు ప్రకటించలేదు.
తెలంగాణపై దిత్వా ఎఫెక్ట్ ఎలా ఉంది
ఏపీపైనే కాకుండా తెలంగాణపై కూడా దిత్వా ఎఫెక్ట్ ఉండే చాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే పలు జిల్లాలను వాతావరణశాఖ అలర్ట్ చేసింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కొమరం భీమ్, మహబూబాబాద్, ములుగు, వరంగల్, హైదరాబాద్ జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
మిరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
