AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Alert: ఏపీ వాసులకు బిగ్ అలర్ట్.. దూసుకొస్తున్న తుఫాన్‌.. మరో మూడు రోజులు భారీ వర్షాలు..

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వానలు పడుతున్నాయి. మరికొద్ది రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే భయపెడుతుంటే.. ఇంకో తుపాను కూడా దడ పుట్టిస్తోంది. ఈనెల 6న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. 7న అల్పపీడనంగా మారి..

Cyclone Alert: ఏపీ వాసులకు బిగ్ అలర్ట్.. దూసుకొస్తున్న తుఫాన్‌.. మరో మూడు రోజులు భారీ వర్షాలు..
Cyclone Mocha
Shiva Prajapati
|

Updated on: May 06, 2023 | 8:20 AM

Share

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వానలు పడుతున్నాయి. మరికొద్ది రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే భయపెడుతుంటే.. ఇంకో తుపాను కూడా దడ పుట్టిస్తోంది. ఈనెల 6న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. 7న అల్పపీడనంగా మారి.. 8న వాయుగుండంగా బలపడనుందని అంచనా వేస్తున్నారు. ఈ తుపాను పశ్చిమ బెంగాల్, మయన్మార్‌ల వైపు పయనిస్తుందని అంచనా వేస్తున్నారు. కోస్తాంధ్ర వైపు కూడా రావొచ్చని చెబుతున్నారు. ఈ తుపానుకు మోకా గా పేరు పెట్టారు. మే నెలలో తుపానులు సహజమే అంటున్నారు. అయితే ఇప్పటికే అకాల వర్షాలతో ఇబ్బందిపడుతున్న రైతులకు తుపాను టెన్షన్ వెంటాడుతోంది.

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భీకర వాన..

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గంలో.. ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గాలుల తీవ్రతకు తూర్పువీధి, మలవ్యనాగర్ ప్రాంతాల్లో ఇళ్లపై భారీవృక్షాలు విరిగిపడ్డాయి. కొమ్మలపూడిలో పిడుగుపాటుకు లక్మయ్య అనే రైతు ప్రాణాలు కోల్పోయాడు.

అల్లూరి జిల్లా ఏజన్సీలో ప్రాంతంలో రచ్చరచ్చ..

అల్లూరి జిల్లా ఏజన్సీ ప్రాంతంలో వాన రచ్చ ఆగలేదు. వర్షపు నీరు రైల్వే ట్రాక్‌ను ముంచేసింది. అరకు ఏజెన్సీలోకురిసిన భారీ వర్షంతో కేకే లైన్లో కరకవలస రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే ట్రాక్‌పై ప్రవహిస్తోంది వరదనీరు. కొండలపై నుంచి వచ్చి చేరుతున్న నీరు దూసుకురావడంతో ట్రాక్‌ అంతా మట్టితో నిండిపోయింది. దీంతో, అప్రమత్తమయ్యారు రైల్వే సిబ్బంది. ఇక బాపట్ల జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం… రైతులకు భారీ నష్టమే మిగిల్చింది. రేపల్లె మండలం ఉప్పూడిలో పిడుగుపడి 14 గొర్రెలు మృతి చెందాయి. పేటేరులో రెండు ఎకరాల వరికుప్ప దగ్ధమైంది.

ఇవి కూడా చదవండి

వర్షాలపై సీఎం జగన్ రివ్యూ మీటింగ్..

మరోవైపు అకాల వర్షాలపై సీఎంవో అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అకాల వర్షాల కారణంగా తడిసిపోయిన ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతుల వద్దనుంచి వెంటనే తడిసిన ధాన్యాన్ని తీసుకునేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్దకాని, ఆర్బీకేల వద్దకాని, రైతుల వద్దకాని ఎక్కడ ధాన్యం నిల్వలున్నా వాటిని వెంటనే అందుబాటులోని గోడౌన్లకు, ఇతర ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలని ఆదేశాలు జారీచేశారు.

తమిళనాడును వదలని వర్షం..

ఇదిలాఉంటే.. తమిళనాడుపైనా వర్షం ప్రభావం ఉంది. రాష్ట్రంలోని పది జిల్లాలపై వర్ష ప్రభావం ఉంది. చెన్నై నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. విల్లుపురం, కాంచీపురం, చెంగల్పట్టు, ఈరోడ్ జిల్లాలకూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తిరువళ్లూరు, ఉమ్మడి వెల్లూర్, ధర్మపురి, తిరువణ్ణామలై జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ జారీ అయ్యింది. భారీ వర్షాలతో కావేరీ నదికి వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. దాంతో ఓకేనక్కల్ జలపాతాలు మూసివేశారు అధికారులు. ఇక అకాల వర్షాల కారణంగా అరియలూర్, తిరువణ్ణామలై జిల్లాలో భారీగా పంట నష్టం చోటు చేసుకుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..