AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కామవాంఛే అతని ప్రాణం తీసింది.. దీపావళికి ఇంటికి రమ్మని పిలిచింది.. కట్ చేస్తే..

ఆమెకు పెళ్లయింది.. కానీ.. అతనికి మాత్రం పెళ్లి కాలేదు.. దీంతో కామవాంఛ తీర్చాలంటూ వివాహిత వెంటపడ్డాడు.. వేధించాడు.. ఆమె సర్దిచెప్పినా అతనిలో ఏమాత్రం మార్పు రాలేదు.. పదే పదే విసిగిస్తుండటంతో.. ఆమె ఈ విషయాన్ని కట్టుకున్న భర్తకు చెప్పింది.. ఆ తర్వాత దంపతులిద్దరూ కలిసి స్కెచ్ వేశారు.. చివరకు ఇంటికి పిలిచి మరి లేపేశారు.. హత్య అనంతరం దంపతులు పారిపోగా.. ఇంటినుంచి దుర్వాసన వస్తుండటంతో ఈ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.

Andhra Pradesh: కామవాంఛే అతని ప్రాణం తీసింది.. దీపావళికి ఇంటికి రమ్మని పిలిచింది.. కట్ చేస్తే..
Crime News
Nalluri Naresh
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Nov 20, 2023 | 1:02 PM

Share

శ్రీ సత్యసాయి జిల్లా, నవంబర్ 20: ఆమెకు పెళ్లయింది.. కానీ.. అతనికి మాత్రం పెళ్లి కాలేదు.. దీంతో కామవాంఛ తీర్చాలంటూ వివాహిత వెంటపడ్డాడు.. వేధించాడు.. ఆమె సర్దిచెప్పినా అతనిలో ఏమాత్రం మార్పు రాలేదు.. పదే పదే విసిగిస్తుండటంతో.. ఆమె ఈ విషయాన్ని కట్టుకున్న భర్తకు చెప్పింది.. ఆ తర్వాత దంపతులిద్దరూ కలిసి స్కెచ్ వేశారు.. చివరకు ఇంటికి పిలిచి మరి లేపేశారు.. హత్య అనంతరం దంపతులు పారిపోగా.. ఇంటినుంచి దుర్వాసన వస్తుండటంతో ఈ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. దంపతులు ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీసత్యసాయి జిల్లా కదిరి నిజాంవలి కాలనీలోని పుట్టగడ్డ వీధిలో ఈ నెల 12వ తేదీన శ్రీకాంత్(23) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. తాళం వేసి ఉంచిన ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సంచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు తెరిచి చూడగా రక్తపు మడుగులో పడి దుర్వాసన వస్తున్న మృతదేహాన్ని గుర్తించారు. మూడు రోజుల క్రితమే హత్య చేసి మృతదేహాన్ని ఇంట్లో పెట్టి తాళం వేసి నిందితులు పరారైనట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. శ్రీకాంత్ హత్య కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. శ్రీకాంత్ తన దగ్గర బంధువు అయిన రామాంజనేయులు భార్య హనుమక్కను తన కామవాంఛ తీర్చాలంటూ కొన్నాళ్లుగా వేధిస్తున్నాడని పోలీసులు విచారణలో తేలింది.

శ్రీకాంత్ లైంగిక వేధింపులు తట్టుకోలేక.. తన భర్త రామాంజనేయులుకు హనుమక్క ఈ విషయం గురించి చెప్పింది. దీంతో తన భార్యను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్న శ్రీకాంత్ పై రగిలిపోయాడు. ఆ తర్వాత రామాంజనేయులు దంపతులు.. ఎలాగైనా శ్రీకాంత్ ను హత్య చేయాలని పక్కా ప్లాన్ వేసుకున్నారు. ఈ ప్లాన్ లో భాగంగా దీపావళి పండుగకు ఇంటికి రావాలని హనుమక్క.. శ్రీకాంత్ కు ఫోన్ చేసింది. శ్రీకాంత్ ను ఇంటికి రప్పించిన హనుమక్క.. అనుకున్న దాని ప్రకారం ప్లాన్ ను అమలు చేసింది.

ప్లాన్ ప్రకారం శ్రీకాంత్ కు ఎక్కడా అనుమానం రాకుండా భోజనం పెట్టింది. ఈ క్రమంలో శ్రీకాంత్ భోజనం చేస్తుండగా రామాంజనేయులు రోకలి బండతో తలపై బాదాడు. అనంతరం ఇద్దరూ కలిసి శ్రీకాంత్ ను హత్య చేశారు. శ్రీకాంత్ చనిపోయాడని నిర్దారించుకున్న తర్వాత మృతదేహాన్ని ఇంట్లో తాళం వేసి దంపతులు పరారయ్యారు. శ్రీకాంత్ లైంగిక వేధింపులు భరించలేక రామాంజనేయులు అతని భార్య హనుమక్క ప్లాన్ ప్రకారమే దీపావళి పండుగకు ఇంటికి పిలిపించుకుని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..