AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Jagan: తగ్గేదేలే అంటున్న సీఎం జగన్ .. చిత్తూరు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర..

మేమంతా సిద్ధం బస్సు యాత్రతో వైసీపీ అధినేత, సీఎం జగన్‌మోహన్ రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మంగళవారం మదనపల్లె సభలో నాన్‌స్టాప్‌ పంచ్‌లతో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు సీఎం జగన్‌. చంద్రబాబు, పవన్‌ టార్గెట్‌గా సెటైర్ల మీద సెటైర్లు పేల్చారు. పశుపతి వస్తున్నాడు జాగ్రత్త... రక్తం తాగేస్తాడంటూ ప్రజలను హెచ్చరించారు. ఫ్యాన్‌ మీ ఇంట్లోనే ఉంటుంది...

YS Jagan: తగ్గేదేలే అంటున్న సీఎం జగన్ .. చిత్తూరు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
Ys Jagan
Shaik Madar Saheb
|

Updated on: Apr 03, 2024 | 8:12 AM

Share

మేమంతా సిద్ధం బస్సు యాత్రతో వైసీపీ అధినేత, సీఎం జగన్‌మోహన్ రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మంగళవారం మదనపల్లె సభలో నాన్‌స్టాప్‌ పంచ్‌లతో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు సీఎం జగన్‌. చంద్రబాబు, పవన్‌ టార్గెట్‌గా సెటైర్ల మీద సెటైర్లు పేల్చారు. పశుపతి వస్తున్నాడు జాగ్రత్త… రక్తం తాగేస్తాడంటూ ప్రజలను హెచ్చరించారు. ఫ్యాన్‌ మీ ఇంట్లోనే ఉంటుంది… సైకిల్‌ బయటే ఉంటుంది… అంటూ ఒక రేంజ్‌లో విరుచుకుపడ్డారు. అయినా… 99శాతం మార్కులు తెచ్చుకున్న వైసీపీ భయపడుతుందా… నెవ్వర్‌ అంటూ విజయంపై ధీమా వ్యక్తంచేశారు సీఎం జగన్‌..

కాగా.. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర ఏడో రోజుకి చేరింది. ఏడో రోజు బుధవారం కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన కొనసాగనుంది. ఉదయం 9గంటలకు అమ్మగారిపల్లె నుంచి బస్సుయాత్ర ప్రారంభం కానుంది. సదుం, కల్లూరు, దామలచెరువు, తలుపులపల్లి మీదుగా సీఎం జగన్ తేనెపల్లికి చేరుకోనున్నారు.

మధ్యాహ్నం తేనెపల్లిలో సీఎం జగన్‌ భోజన విరామం.. అనంతరం తేనెపల్లి, రంగంపేట క్రాస్ మీదుగా పూతలపట్టు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు పూతలపట్టులో సీఎం జగన్ బహిరంగ సభ జరగనుంది. సభ తర్వాత పి.కొత్తకోట, పాకాల, గదంకి, పనపాకం, ముంగిలిపట్టు, మామండూరు, ఐతేపల్లి, చంద్రగిరి.. రేణిగుంట మీదుగా గురువరాజుపల్లెకు సీఎం జగన్ బస్సుయాత్ర చేరుకోనుంది. రాత్రికి గురువరాజుపల్లెలో సీఎం జగన్‌ బస చేయనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..