Yaas Cyclone: ఉత్తరాంధ్ర జిల్లా కలెక్టర్లతో సీఎం సమీక్ష.. తుఫాన్ దృష్ట్యా అధికారులకు దిశానిర్దేశం

బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్‌ తుఫాన్ ప్రస్తుతం ఒడిశా తీరానికి సమీపంలో ఉంది. దీని ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపైనా ఉండొచ్చన్న వాతావరణ శాఖ నివేదిక నేపథ్యంలో..

Yaas Cyclone:  ఉత్తరాంధ్ర జిల్లా కలెక్టర్లతో సీఎం సమీక్ష.. తుఫాన్  దృష్ట్యా అధికారులకు  దిశానిర్దేశం
Cm Jagan On Yaas Cyclone
Follow us
Ram Naramaneni

|

Updated on: May 25, 2021 | 3:35 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్‌ తుఫాన్ ప్రస్తుతం ఒడిశా తీరానికి సమీపంలో ఉంది. దీని ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపైనా ఉండొచ్చన్న వాతావరణ శాఖ నివేదిక నేపథ్యంలో…. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష చేపట్టారు. యస్ తుఫాన్ ప్రభావంపై విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల కలెక్టర్లతో చర్చించారు. తుఫాన్ దృష్ట్యా ముందస్తు చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. తుఫాన్ తీరం దాటే వరకు కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఈ వర్చువల్ సమావేశానికి శ్రీకాకుళం జిల్లా నుంచి హాజరయ్యారు. శ్రీకాకుళంలో అక్కడక్కడా జల్లులు తప్ప యాస్‌ తుఫాన్ ప్రభావం పెద్దగా కనిపించలేదని ఆయన సీఎంకు వివరించారు. తాత్కాలిక నిర్మాణాల్లో కొవిడ్ రోగులు లేకుండా చర్యలు తీసుకున్నామని, విద్యుత్ కు అంతరాయం లేకుండా జనరేటర్లు, డీజిల్ సిద్ధం చేశామని తెలిపారు.

యాస్ తుఫాన్ తీవ్ర తుఫాన్ గా మారుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది ప్రస్తుతం ఒడిశాలోని పరదీప్ కు దక్షిణ ఆగ్నేయ దిశగా 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. యాస్‌ తుఫాన్ రేపు పరదీప్, బెంగాల్ లోని సాగర్ ఐలాండ్ మధ్య తీరం దాటనుంది. తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ శాస్త్రవేత్తలు తెలిపారు. కోస్తా జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల ఇదే తరహాలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఏపీ తీర ప్రాంతంలో గంటకు 40నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని…. తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇదే తీవ్రత కొనసాగుతుందని వెల్లడించారు.

ఉత్తరాంధ్ర, ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల తీరాల్లో సముద్రం అత్యంత కల్లోలంగా ఉంటుందని వాత‌వ‌ర‌ణ శాఖ నిపుణులు హెచ్చరించారు. మంగ‌ళ‌వారం నుంచి 27లోపు ఒడిశా, పశ్చిమబెంగాల్‌, సిక్కిం రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పలుచోట్ల ఉంటాయన్నారు. చేపల వేట నిషేధ హెచ్చరికలు కొనసాగుతున్నాయి. లోతట్టు, తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు

Also Read: ఆనంద‌య్య నాటు మందుపై న‌టుడు జ‌గ‌ప‌తిబాబు కీల‌క వ్యాఖ్య‌లు..

ఏపీలో ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై అమిత్‌షాకు లోకేశ్‌ లేఖ‌.. ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసేలా చూడాల‌ని..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!