AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nara Lokesh: ఏపీలో ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై అమిత్‌షాకు లోకేశ్‌ లేఖ‌.. ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసేలా చూడాల‌ని..

Nara Lokesh: క‌రోనా సంక్షోభం కార‌ణంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తూ ఆయా రాష్ట్రాల ప్ర‌భుత్వాలు నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఆంధ్ర్రప్ర‌దేశ్‌లో...

Nara Lokesh: ఏపీలో ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై అమిత్‌షాకు లోకేశ్‌ లేఖ‌.. ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసేలా చూడాల‌ని..
Nara Lokesh Letter
Narender Vaitla
|

Updated on: May 25, 2021 | 2:52 PM

Share

Nara Lokesh: క‌రోనా సంక్షోభం కార‌ణంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తూ ఆయా రాష్ట్రాల ప్ర‌భుత్వాలు నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఆంధ్ర్రప్ర‌దేశ్‌లోమాత్రం ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించ‌లేదు. వాయిదా వేస్తున్న‌ట్లు మాత్ర‌మే ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే జూన్ 7 నుంచి 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. దీంతో ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యంపై టీడీపీ నాయ‌కులు నారా లోకేశ్‌ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. రాష్ట్రంలో ప‌ది, ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రం ప‌రీక్షల ర‌ద్దు విష‌యంపై జోక్యం చేసుకోవాల‌ని కోరారు. ఈ క్ర‌మంలో లోకేశ్‌ లేఖ‌లో ప్ర‌స్తావిచిన పలు అంశాలు.. దేశంలోని దాదాపు 14 రాష్ట్రాలతో పాటు ఐసిఎస్‌ఈ, సిబిఎస్‌ఈ బోర్డులు పరీక్షలు రద్దు చేశాయి. ఏపీలో మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శించారు. జూన్ 7 నుంచి వేలాది పరీక్షా కేంద్రాల్లో 6.7 లక్షల మంది విద్యార్థులకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని.. 5 లక్షలకు పైగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు తమ పరీక్షల పట్ల అనిశ్చితిని ఎదుర్కొంటున్న‌ర‌ని చెప్పుకొచ్చారు. దీంతో విద్యార్థులు ఎంతో మానసిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. అనవసరంగా మరింత మందిని కరోనా రెండో దశ ఉధృతికి పరీక్షల వంకతో పణంగా పెట్టడం తగదని లోకేష్ వ్యాఖ్యానించారు. పరీక్షల నిర్వహణతో విద్యార్థులను సూపర్‌స్ప్రెడర్ లుగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. పది, ఇంటర్ పరీక్షల విషయంలో సిబిఎస్ఈ అనుసరిస్తున్న విధానాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేసేలా చర్యలు తీసుకోవాల‌ని లోకేశ్‌ లేఖ‌లో పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆందోళనలను గమనించి విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం నిర్ణయం తీసుకోవాలని లోకేశ్‌ కేంద్రాన్ని కోరారు.

Also Read: RBI Guidelines: ఆ బ్యాంకుల విలీనానికి లైన్‌ క్లియర్‌.. మార్గ దర్శకాలను జారీ చేసిన ఆర్బీఐ..!

చైనాలో ప్రకృతి పగబట్టిన వేళ …..ఆరుగురు మారథాన్ రన్నర్స్ ని రక్షించిన గొర్రెల కాపరి, ‘హీరో’గా వెల్లువెత్తిన ప్రశంసలు

Siddipet Additional SP: తలకు రుమాలు, ఆఫ్ షర్ట్‌‌తోపాటు పాత మోటార్ బైక్‌.. మారువేషంలో ఆడిషనల్ ఎస్పీ.. పోలీసులకు షాక్..!