Andhra Pradesh: విద్యార్థుల తల్లులకు గుడ్ న్యూస్.. ఇవాళ ఖాతాల్లో జమకానున్న జగనన్న వసతి దీవెన
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల్లో జగనన్న వసతి దీవెన ఒకటి. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రోజున రాష్ట్రంలోని 9,55,662 మంది విద్యార్ధుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేయనుంది.దాదాపు రూ.912.71 కోట్లను విద్యార్థుల తల్లులకు ఇవ్వనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల్లో జగనన్న వసతి దీవెన ఒకటి. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రోజున రాష్ట్రంలోని 9,55,662 మంది విద్యార్ధుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేయనుంది.దాదాపు రూ.912.71 కోట్లను విద్యార్థుల తల్లులకు ఇవ్వనుంది. అనంతపురం జిల్లా నార్పలలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ బటన్‌నొక్కి ఈ నగదు మొత్తాన్ని విడుదల చేయనున్నారు. అయితే బుధవారం జమ చేయనున్న రూ.912.71 కోట్లతో కలిపి ఇప్పటిదాకా రూ.4,275.76 కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
విద్యార్థుల విద్య తల్లిదండ్రులకు భారం కాకూడదనే లక్ష్యంతో ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ వస్తోంది. అయితే సీఎం జగన్ ఇప్పటి వరకు సుమారు రూ.58,555,07కోట్లు ఖర్చు చేశారు. 2017నుంచి పెండింగ్ పెట్టిన బకాయిలు రూ.1778 కోట్లు కూడా వైసీపీ సర్కార్ చెల్లించింది. కేవలం సరిపడ నిధుల్లేకే ఈ వసతి దీవెన కార్యక్రమం వాయిదా వేసినట్లు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ఆర్థిక శాఖ సూచనల మేరకే వసతి దీవెనను వాయిదా వేశామన్నారు. సంక్షేమ పథకాల అమలుకు నిధుల ఇబ్బందులు లేకుండా ప్రయాత్నాలు చేస్తూనే ఉన్నామని పేర్కొన్నారు.