CM Jagan on corona: 104 వ్యవస్థ మరింత బలోపేతం.. క‌రోనాపై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష.. కీల‌క ఆదేశాలు

AP CM Jagan: కొవిడ్‌ ప్రత్యేక అధికారులు, టాస్క్‌ఫోర్స్‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జగన్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. 104 వ్యవస్థ మరింత బలోపేతం కావాలని ఈ స‌మావేశంలో సీం అధికారుల‌కు సూచించారు.

CM Jagan on corona: 104 వ్యవస్థ మరింత బలోపేతం.. క‌రోనాపై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష.. కీల‌క ఆదేశాలు
Cm Jagan Review On Corona
Follow us
Ram Naramaneni

|

Updated on: May 10, 2021 | 3:39 PM

కొవిడ్‌ ప్రత్యేక అధికారులు, టాస్క్‌ఫోర్స్‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జగన్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. 104 వ్యవస్థ మరింత బలోపేతం కావాలని ఈ స‌మావేశంలో సీం అధికారుల‌కు సూచించారు. అధికారులు నిత్యం మాక్‌ కాల్స్‌ చేసి పనితీరు పర్యవేక్షించాలని ఆదేశించారు. రద్దీ ఉన్న జిల్లాల్లో బెడ్స్ సంఖ్య‌ను బాగా పెంచాలన్నారు. 104కు కాల్ చేస్తే జాప్యం ఉండ‌కుండా.. త్వ‌రిత‌గ‌తిన‌ స్పందించాలని పేర్కొన్నారు. బెడ్‌ అవసరం లేదంటే కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు పంపించాలని.. 104కు కాల్‌ చేసే కొవిడ్‌ బాధితులకు కచ్చితంగా సాయం అందాలని సీఎం జగన్​ సూచించారు. ప్రతి ఆస్పత్రిలో కూడా ఆరోగ్య మిత్ర ఉండాలన్నారు.

వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద, రద్దీ, తోపులాట కనిపించకూడదని సీఎం అధికారులకు ఆదేశించారు. నెలకు 19 లక్షలకు పైగా డోసులే వస్తున్నాయని.. వ్యాక్సిన్ల కొనుగోలుపై గ్లోబల్‌ టెండర్‌ వెళ్లడంపై ఆలోచించాలని ముఖ్య‌మంత్రి అన్నారు. గ్లోబల్ టెండర్‌పై ఆలోచించి అధికారులు నిర్ణయం తీసుకోవాలన్నారు. ఏ రాష్ట్రానికి ఎన్ని వ్యాక్సిన్లు అమ్మాలనే విషయాన్ని కేంద్రమే నిర్ణయిస్తోంద‌ని సీఎం చెప్పారు. కేంద్రం నిర్ణయించిన కోటా మేరకే వ్యాక్సిన్ కొనుగోలు చేయాల్సి ఉంటుందని, అదికూడా డబ్బును ముందుస్తుగా చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. వ్యాక్సిన్ ఎవరికి వేస్తారనేది ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు చెప్పాలని స్పష్టం చేశారు. 45 ఏళ్లు దాటిన వారికి రెండో డోస్‌ అందేలా చూడాలని సూచించారు. పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు బ్లాక్ మ‌ర్కెట్ లో అమ్మ‌కుండా చూడాలన్నారు. రెమ్‌డెసివిర్‌ వినియోగంపై ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఆడిటింగ్‌ ఉండాలని సీఎం పేర్కొ న్నారు. రాష్ట్రంలో కర్ఫ్యూ అమలవుతున్న తీరుపై ప్రతి జిల్లా నుంచి ప్రతి రోజూ నివేదిక ఇవ్వాలని డీజీపీకి సీఎం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల్లో ప్రతి బుధవారం కోవిడ్ రివ్యూ కమిటీలు సమావేశం కావాలని సీఎం సూచించారు.

Also Read: క‌రోనా బారిన‌ప‌డ్డ జూనియ‌ర్ ఎన్టీఆర్.. స్వ‌యంగా ట్వీట్.. ప్ర‌స్తుతం ఎలా ఉందంటే

 తెలంగాణ పోలీసుల కొత్త ఆంక్షలు.. సరిహద్దుల్లో ఏపీ కరోనా అంబులెన్సుల అడ్డగింత..

తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్
'అభివృద్ధికి విద్య తప్పనిసరి.. అందుకు భారత్ కేంద్రంగా మారాలి' RSS
'అభివృద్ధికి విద్య తప్పనిసరి.. అందుకు భారత్ కేంద్రంగా మారాలి' RSS
ఆస్కార్ కోసం రాజమౌళిని ఫాలో అవుతున్న ఆమిర్
ఆస్కార్ కోసం రాజమౌళిని ఫాలో అవుతున్న ఆమిర్
బెయిల్‌పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
బెయిల్‌పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
BSNL శబరిమలలో 48 ప్రదేశాలలో Wi-Fi.. ఫోన్‌లో ఎలా కనెక్ట్ చేయాలి?
BSNL శబరిమలలో 48 ప్రదేశాలలో Wi-Fi.. ఫోన్‌లో ఎలా కనెక్ట్ చేయాలి?
యాంకర్లుగా బిజీ అవుతున్న హీరోలు.. తగ్గేదేలే..
యాంకర్లుగా బిజీ అవుతున్న హీరోలు.. తగ్గేదేలే..
పాన్ ఇండియా ట్రెండ్‌లో సినిమాలు.. వెండితెర మీద ఊహాలోకాలు..
పాన్ ఇండియా ట్రెండ్‌లో సినిమాలు.. వెండితెర మీద ఊహాలోకాలు..