AP Ambulance: హైదరాబాద్‌లోకి ఏపీ అంబులెన్స్‌ల అనుమతి నిరాకరిస్తోన్న వేళ.. కీలక ప్రకటన చేసిన ఏపీ పోలీసులు..
AP Ambulance At Telangana Border: కరోనా మహమ్మారి రాష్ట్రాల మధ్య దూరాన్ని కూడా పెంచేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల మధ్య రాకపోకలపై ఆయా ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే..
AP Ambulance At Telangana Border: కరోనా మహమ్మారి రాష్ట్రాల మధ్య దూరాన్ని కూడా పెంచేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల మధ్య రాకపోకలపై ఆయా ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్ నుంచి కరోనా రోగులతో వస్తోన్న అంబులెన్స్‌లను పోలీసులు తెలంగాణలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. సోమవారం ఉదయం వీటికి సంబంధించిన వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. వైద్య చికిత్సల కోసం హైదరాబాద్ ప్రైవేటు అంబులెన్సులో వెళ్తోన్న వారికి షరతులతో కూడిన అనుమతులు జారీ చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. దీనికి వీలు కానీ పక్షంలో కరోనా రోగికి చికిత్స చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని.. హైదరాబాద్‌కు చెందిన సదరు ఆసుపత్రి యాజమాన్యం నుంచి ముందుగానే అంగీకార పత్రాన్ని తీసుకోవాలని సూచించారు. ఇలా ముందస్తు అనుమతులతో వెళ్లిన వారికే తెలంగాణలోకి అనుమతి ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇక సోమవారం ఉదయం నుంచి ఏపీ నుంచి హైదరాబాద్‌కు కోవిడ్ పేషెంట్స్‌తో వస్తోన్న అంబులెన్స్‌లను సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురంలోని అంతర్రాష్ట్ర సరిహద్దు, కర్నూలు జిల్లా పుల్లూరు టోల్‌గేట్ వద్ద ఆ రాష్ట్ర పోలీసులు తనిఖీలు చేపట్టి.. అంబులెన్స్‌లను వెనక్కి పంపిస్తున్నారు.
Also Read: Bigg Boss Kannada 8: కన్నడ బిగ్ బాస్ మొదలు పెట్టిన దగ్గర నుంచి అవాంతరాలు.. తాజాగా షో క్యాన్సిల్