AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Kannada 8: కన్నడ బిగ్‌ బాస్ మొదలు పెట్టిన దగ్గర నుంచి అవాంతరాలు.. తాజాగా షో క్యాన్సిల్

కన్నడ బిగ్‌ బాస్‌పై కరోనా ఎఫెక్ట్ పడింది. 100 రోజులకు పైగా కొనసాగించాలని ప్లాన్ చేసిన ఈ సీజన్‌ను అర్ధాంతరంగా ముగించారు నిర్వహకులు. ఇంకా ఎనిమిది మంది కంటెస్టెంట్‌లు హౌస్‌లో ఉండగానే...

Bigg Boss Kannada 8: కన్నడ బిగ్‌  బాస్ మొదలు పెట్టిన దగ్గర నుంచి అవాంతరాలు.. తాజాగా షో క్యాన్సిల్
Bigg Boss kannada Winner
Ram Naramaneni
|

Updated on: May 10, 2021 | 5:02 PM

Share

కన్నడ బిగ్‌ బాస్‌పై కరోనా ఎఫెక్ట్ పడింది. 100 రోజులకు పైగా కొనసాగించాలని ప్లాన్ చేసిన ఈ సీజన్‌ను అర్ధాంతరంగా ముగించారు నిర్వహకులు. ఇంకా ఎనిమిది మంది కంటెస్టెంట్‌లు హౌస్‌లో ఉండగానే… విన్నర్‌ ఎవరో తేలకముందే బిగ్‌ బాస్‌కు గుడ్‌బై చెప్పేశారు. కర్ణాటకలో కేసులు భారీ స్థాయిలో పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కిచ్చా సుదీప్‌ హోస్ట్ చేస్తున్న ఈ షో ఫిబ్రవరి 28న ప్రారంభమైంది. దాదాపు 71 రోజుల పాటు సాగింది. ఇంకా ఎనిమిది మంది కంటెస్టెంట్‌లు హౌస్‌లో ఉన్నారు. వాళ్లంతా సేఫ్‌గా ఆనందంగానే ఉన్నా… బయటి పరిస్థితుల దృష్ట్యా షోనూ క్యాన్సిల్ చేయాలని నిర్ణయించామని తెలిపారు ఆర్గనైజర్స్‌. ఈ విషయాన్ని తెలియజేస్తూ కలర్స్‌ కన్నడ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. విజేతగా ఎవ‌ర్నీ ప్ర‌క‌టించ‌లేదు. అయితే నెటిజ‌న్లు మాత్రం ప్ర‌శాంత్ స‌మ్ బ‌ర్గీని విన్న‌ర్ గా డిక్లేర్ చేస్తూ.. సోష‌ల్ మీడియాలో పోస్టుల పెడుతున్నారు.

కన్నడ బిగ్‌ బాస్ 8 మొదలు పెట్టిన దగ్గర నుంచి అవాంతరాలు ఎదురవుతున్నాయి. లాస్ట్ ఇయరే స్టార్ట్ కావాల్సిన ఈ షో కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా ఆలస్యమైంది. షో ప్రారంభమైన కొద్ది రోజులకే సుధీప్‌ ఆరోగ్యం దెబ్బతినటంతో ఆయన కొంతకాలం షోకు దూరంగా ఉన్నారు. తిరిగి సుధీప్‌ జాయిన్‌ అయినా… సీజన్‌ రద్దయ్యింది.

Also Read: 104 వ్యవస్థ మరింత బలోపేతం.. క‌రోనాపై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష.. కీల‌క ఆదేశాలు

తెలంగాణ పోలీసుల కొత్త ఆంక్షలు.. సరిహద్దుల్లో ఏపీ కరోనా అంబులెన్సుల అడ్డగింత..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి