Billionaire employees: ప్రపంచంలో అత్యంత ధనవంతులైన ఉద్యోగులు ఉన్న సంస్థ ఎక్కడుందో తెలుసా? అక్కడ ఎంతమంది కొటీశ్వరులంటే..

Billionaire employees in world: ప్రపంచంలోని అత్యంత ధనవంతులు ఏ దేశానికి చెందినవారు ఉంటారు అంటే.. వెంటనే ఎవరైనా తడుముకోకుండా అమెరికా లేదా ఏదైనా ధనిక దేశం పేరు చెబుతారు.

Billionaire employees: ప్రపంచంలో అత్యంత ధనవంతులైన ఉద్యోగులు ఉన్న సంస్థ ఎక్కడుందో తెలుసా? అక్కడ ఎంతమంది కొటీశ్వరులంటే..
Billionaire Employees In World
KVD Varma

|

May 10, 2021 | 4:41 PM

Billionaire employees in world: ప్రపంచంలోని అత్యంత ధనవంతులు ఏ దేశానికి చెందినవారు ఉంటారు అంటే.. వెంటనే ఎవరైనా తడుముకోకుండా అమెరికా లేదా ఏదైనా ధనిక దేశం పేరు చెబుతారు. అత్యంత ఎక్కువ జీతం కలిగిన ఉద్యోగులు ఏ కంపెనీలో ఉంటారు అనగానే అమెజాన్.. గూగుల్.. ఫేస్ బుక్ అని గబ గబా చెప్పేస్తారు. అందరూ అలానే అనుకుంటారు. కానీ, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. వాటిని మించి.. చైనాలోని ఓ కంపెనీ తమ ఉద్యోగులకు జీతాలు ఇస్తోంది. ఎంత అంటే.. ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు చాలా మంది బిలియనీర్లే. అసలు చైనా రాజధాని బీజింగ్ లోనే అత్యధిక మంది బిలియనీర్లు ఉన్నారంటే నమ్మగలరా? అక్కడ ప్రపంచంలోని 100 మంది బిలియనీర్లు ఉన్నారు. ఇది నిజం. ఇక ఎక్కువ మంది బిలియనీర్లు ఉద్యోగులు ఉన్న కంపెనీ కూడా ఒకటి ఉంది. ఆ వివరాలు తెలుసుకుందాం..

చాలా మంది బిలియనీర్ల (Billionaire employees in world)విషయంలో, చైనా కంపెనీలు అమెరికన్ కంపెనీల కంటే ముందున్నాయి. చైనాలోని ఒక బ్యాటరీ తయారీ సంస్థలో కేవలం 9 బిలియనీర్లు ఉన్నారు. ఇది ఎవరికీ తెలియదు. కాగా, ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ సంస్థలైన ఫేస్‌బుక్, వాల్‌మార్ట్, గూగుల్‌లో అన్నిటిలోనూ కలిపి 8 బిలియనీర్లు మాత్రమే ఉన్నారు. కానీ, చైనా సంస్థ కాంటెంపరరీ అంపెక్స్ టెక్నాలజీ (సిఎటిఎల్) ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు కలిగి ఉన్న కంపెనీగా నిలిచింది. ఇక్కడే ఇందాక మనం చెప్పుకున్న 9 మంది బిలియనియర్ ఉద్యోగులున్నారు. ఫాక్స్ వాగన్, బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి బ్ కార్లకు బ్యాటరీలను తయారు చేస్తుంది ఈ సంస్థ. సిఎటిఎల్ ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన, లగ్జరీ కార్ల సంస్థలైన బిఎమ్‌డబ్ల్యూ, ఫాక్స్ వాగన్, మెర్సిడెస్ బెంజ్ యొక్క ఎలక్ట్రిక్ మోడళ్ల కోసం బ్యాటరీలను తయారు చేస్తుంది .

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక బ్యాటరీలను చైనా తయారు చేస్తుంది, ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లలో ఉపయోగించే బ్యాటరీలలో 22% వాటా సిఎటిఎల్ కు ఉంది. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమోటివ్ మరియు ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్. ఈ దృష్ట్యా, సిఎటిఎల్ ఇప్పుడు ప్రారంభంతో పోలిస్తే దాని సామర్థ్యాన్ని చాలా రెట్లు పెంచింది. ఎడామాస్ ఇంటెలిజెన్స్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ కార్లలోని 22% బ్యాటరీలు సిఎటిఎల్ తో తయారు చేయబడ్డాయి. దీనికి మించి, ఒక సంస్థ మాత్రమే ఈ రంగంలో ఉంది. అది అలెర్జీ ఎనర్జీ సొల్యూషన్స్. ఈ సంస్థ పోలాండ్ దేశానికి చెందింది. దీని మార్కెట్ వాటా 28%.

సిఎటిఎల్ సంస్థ వయస్సు కేవలం 10 సంవత్సరాలు, చాలా కొంతమందికి మాత్రమే దాని గురించి తెలుసు. ప్రపంచంలోని అతిపెద్ద బిలియనీర్ సంస్థ అయిన సిఎటిఎల్ ప్రత్యేకత ఏమిటంటే ఇది 10 సంవత్సరాల క్రితం మాత్రమే స్థాపించబడింది, అంటే 2011 లో, కానీ ఈ కంపెనీకి కరోనా కాలం కలిసొచ్చింది. ఒక్కదెబ్బతో ఒక సంవత్సరంలో దాని షేర్ ధర 150% పెరిగింది.

సిఎటిఎల్ వ్యవస్థాపకుడు, సీఈవో రాబిన్ జెంగ్. గతంలో ఎలక్ట్రానిక్ కంపెనీలో ఇంజనీర్‌గా ఉంటూ సంస్థలో 25% వాటాను కలిగి ఉండేవాడు. తను 1999 లో లిథియం అయాన్ బ్యాటరీల తయారీని ప్రారంభించాడు. తరువాత 2011 లో, అతను సిఎటిఎల్ ను స్థాపించాడు. మార్చి 2020 తో పోలిస్తే రాబిన్ జెంగ్ ఆస్తులు మూడు రెట్లు పెరిగాయి. ఫోర్బ్స్ జాబితాలో ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో అతను 47 వ స్థానంలో ఉన్నాడు.

వాస్తవానికి, 2015 నుండి, చైనా ప్రభుత్వం ఎలక్ట్రిక్ కార్ల కోసం బ్యాటరీలను తయారుచేసే సంస్థలకు రాయితీలు ఇవ్వడం ప్రారంభించింది. మరోవైపు, నిరంతర కాలుష్యం అదేవిధంగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల మధ్య, కార్ల తయారీదారులు ఎలక్ట్రానిక్ కార్లను చాలా చౌకగా ప్రోత్సహించడం ప్రారంభించారు. దీనివల్ల బ్యాటరీలకు డిమాండ్ పెరిగింది. చైనా ప్రభుత్వం నుండి రాయితీలు రావడంతో వాటిని పెంచినట్లు సిఎటిఎల్ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. సిఎటిఎల్ తన వ్యూహాన్ని, నిరంతర పెట్టుబడి, పరిశోధన అలాగే అభివృద్ధి అనే మూడు అంశాల ప్రాతిపదికగా ముందుకు సాగుతున్నట్టు చెబుతుంది. కానీ, చైనా ప్రభుత్వం కూడా ఈ సంస్థ కోసం ఇస్తున్న రాయితీల వల్ల కూడా కంపెనీ వేగవంతంగా పైకెగసిందని అక్కడి వ్యాపార వర్గాలు నమ్ముతున్నాయి.

Also Read: Cyber Attack: అమెరికాలో సైబర్ అటాక్ కలకలం.. ప్రధాన ఇంధన పైప్‌లైన్‌ నిలిపివేత

Sadiq Khan: లండ‌న్ మేయ‌ర్‌గా పాక్ సంతతికి చెందిన సాదిక్ ఖాన్ ఎన్నిక.. వరుసగా రెండోసారి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu