CM Jagan: వైసీపీ శ్రేణుల‌కు గుడ్ న్యూస్.. నామినేటెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్న‌ల్.. ఆ రోజే ముహూర్తం!

వైసీపీలో ప‌ద‌వుల జాత‌ర మొద‌ల‌వ్వ‌బోతుంది. రాజకీయ నిరుద్యోగులకు పదవులు అందేందుకు సర్వం సిద్ధం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నామినేటెడ్....

CM Jagan: వైసీపీ శ్రేణుల‌కు గుడ్ న్యూస్.. నామినేటెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్న‌ల్.. ఆ రోజే ముహూర్తం!
Cm Jagan
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 13, 2021 | 6:13 PM

వైసీపీలో ప‌ద‌వుల జాత‌ర మొద‌ల‌వ్వ‌బోతుంది. రాజకీయ నిరుద్యోగులకు పదవులు అందేందుకు సర్వం సిద్ధం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు పూర్తయింది. కార్పొరేషన్ ఛైర్మ‌న్ల‌తో పాటు డైరెక్టర్‌ పోస్టులను కలిపి ఒకేసారి భర్తీ చేయనున్నారు. దీనికి ఈనెల 14 తేదీన ముహుర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా సింగిల్ డిజిట్ నామినేషన్ పోస్టులు తప్ప మిగతావి భర్తీ చెయ్యలేదు. ఈ నేపథ్యంలో ఒకేసారి మిగిలిన పదవులు భర్తీ చేసేందుకు సర్కార్ రంగం సిద్ధం చేసింది. దాదాపు 70 కార్పొరేషన్ చైర్మన్ పదవులు, ఆయా కార్పొరేషన్‌‌లకు మరో 840 డైరెక్టర్ల పదవులు భర్తీ కానున్నాయి. ఇక.. నామినేషన్ పోస్టుల భర్తీ విషయంలో పక్కా ఫార్ములా అమలు చేస్తుంది అధికార వైసీపీ. పదవుల భర్తీని మూడు అంచెలుగా విభజించినట్లు తెలుస్తోంది. మొదటి ప్రాధాన్యతగా గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన వారికి ఛైర్మ‌న్ పదవులు దక్కనున్నాయి. ఆ తర్వాత ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసిన వారికి ఇందులో ఛాన్స్ ఇస్తున్నారు. చివరిగా పార్టీలో సీనియర్‌లుగా ఉంటూ ఎన్నికల్లో టికెట్ దక్కని వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అటు.. డైరెక్టర్ల బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు ప్రపోజ్ చేసినవారికి డైరెక్టర్లుగా పదవులు దక్కనున్నాయి. మొత్తానికి రెండేల్ల ఎదురుచూపులు నెరవేరబోతున్న సమయం ఆసన్నం కావడంతో ఆశావహులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప‌ద‌వులు ద‌క్కించుకునేందుకు త‌మ మార్క్ లాబీయింగ్ మొద‌లెట్టారు.

Also Read: సగం మెడ తెగిన కోడి పుంజు ?జంప్.. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లిలో ఘ‌ట‌న‌

ఆకాశం నుంచి కిందపడిన వ్యక్తి.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌..!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?