CM Jagan: దెబ్బతిన్న వరిపంటలు, ధాన్యం కొనుగోలుపై సీఎం జగన్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
తుఫాన్ అనంతర పరిస్థితులు.. వరి ధాన్యం కొనుగోలుపై క్యాంప్ కార్యాలయంలో రివ్యూ చేశారు సీఎం జగన్. ఈ సమావేశంలో అధికారులతో పాటు ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. తుపాను బాధిత ప్రాంతాల్లో రైతులను ఆదుకుంటున్న చర్యల్ని ప్రధానంగా అడిగి తెలుసుకున్నారు సీఎం. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందన్న భరోసా వారిలో కల్పించాలని అధికారుల్ని ఆదేశించారు
తుఫాన్ అనంతర పరిస్థితులు.. వరి ధాన్యం కొనుగోలుపై క్యాంప్ కార్యాలయంలో రివ్యూ చేశారు సీఎం జగన్. ఈ సమావేశంలో అధికారులతో పాటు ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. తుపాను బాధిత ప్రాంతాల్లో రైతులను ఆదుకుంటున్న చర్యల్ని ప్రధానంగా అడిగి తెలుసుకున్నారు సీఎం. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందన్న భరోసా వారిలో కల్పించాలని అధికారుల్ని ఆదేశించారు. రంగు మారిన.. తడిసిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేస్తోందనే విషయాన్ని వివరించాలన్నారు. ప్రతి గింజను కూడా కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని.. ఇదే విషయాన్ని బాధిత రైతులకు తెలిపి భరోసా ఇవ్వాలన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో లిబరల్‌గా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. కొన్ని నిబంధనలు సడలించి అయినా రైతులకు న్యాయం చేయాలన్నారు. రైతుల దగ్గరున్న ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకి పంపే బాధ్యతను పౌరసరఫరాల శాఖ అధికారులు తీసుకుంటారన్నారు. ఆర్బీకేల వారీగా ఈ కొనుగోళ్లు జరుగుతాయన్నారు సీఎం. సకాలంలో వారికి ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు అన్నిరకాల చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి వివరించారు. అలాగే పంట నష్టపోయిన వారికి వైఎస్సార్ ఉచిత బీమాకింద పరిహారం అందించడానికి అనుసరించాల్సిన ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలన్నారు. నష్టపోయిన ప్రతిరైతునూ ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు.
సమావేశంలో ఎన్యూమరేషన్ ప్రక్రియపై ఆరా తీశారు సీఎం జగన్. ఈ నెల 18 వరకు ఎన్యూమరేషన్ జరుగుతుందని.. 19 నుంచి 22 వరకు సోషల్ ఆడిట్ కోసం ఆర్బీకేలలో లిస్ట్‌లు అందుబాటులో ఉంచుతామని సీఎంకు వివరించారు వ్యవసాయ శాఖ అధికారులు. 23 నుంచి 25 వరకు సవరణలు ఆ తర్వాత అభ్యంతరాల స్వీకరణ ఉంటుందన్నారు. 26న జిల్లా కలెక్టర్లు తుది జాబితాలు ప్రభుత్వానికి పంపుతామన్నారు. సంక్రాంతిలోగా ఇన్‌పుట్ సబ్సిడీ రైతులకు అందాలని.. అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో సీఎం అధికారులకు సూచించారు.మిచౌంగ్ తుఫాన్‌తో దెబ్బతిన్న పంటలు.. రంగుమారిన ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు సీఎం జగన్. ప్రతీ గింజను కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని.. అదే విషయాన్ని రైతులకు వివరించాలని అధికారుల్ని ఆదేశించారు.
మంత్రులు, అధికారులతో సీఎం జగన్..
ఇటీవల తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలపై, రంగుమారిన వరి ధాన్యం కొనుగోలుపై సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సమీక్ష. తుపాను బాధిత ప్రాంతాల్లో రైతులను ఆదుకుంటున్న చర్యలపై ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులతో చర్చ. pic.twitter.com/GzXptOzKl8
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) December 12, 2023
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..