AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: ఇళ్ల నిర్మాణంలో రాజీ వద్దు.. అనుకున్న సమయానికి పూర్తి చేయాలి.. సీఎం జగన్..

పేదలకు నిర్మించి ఇస్తున్న ఇళ్లను అనుకున్న సమయానికి పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం.. ప్రభుత్వమే ఇళ్లు నిర్మించేలా ఆప్షన్‌–3ని ఎంపిక చేసుకున్న...

CM Jagan: ఇళ్ల నిర్మాణంలో రాజీ వద్దు.. అనుకున్న సమయానికి పూర్తి చేయాలి.. సీఎం జగన్..
Cm Jagan
Ganesh Mudavath
|

Updated on: Nov 25, 2022 | 6:28 AM

Share

పేదలకు నిర్మించి ఇస్తున్న ఇళ్లను అనుకున్న సమయానికి పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం.. ప్రభుత్వమే ఇళ్లు నిర్మించేలా ఆప్షన్‌–3ని ఎంపిక చేసుకున్న లబ్ధిదారులకు రాజీ లేని విధంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సూచించారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యతను నిరంతరం పాటించడానికి ఎస్‌ఓపీలను అందుబాటులో ఉంచాలన్న సీఎం.. ప్రతి దశలోనూ నాణ్యతా నిర్ధరణ పరీక్షలు జరగాలని చెప్పారు. గ్రామ సచివాలయాల్లో ఉన్న ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ సేవలను ఉపయోగించుకోవాలన్నారు. ఇళ్లు లేని వారికి ఇళ్లు ఇవ్వడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్న సీఎం జగన్.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ.5,655 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఈ పనులకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్‌లు సిద్ధం అయ్యాయని సీఎంకు అధికారులు తెలిపారు. ప్రాధాన్యతాక్రమంలో చేసుకుంటూ వెళ్తున్నామన్నారు.

లే అవుట్లను సందర్శించినట్లుగా ఫొటోలను అప్‌లోడ్‌ చేయాలి. ప్రతి శనివారంను హౌసింగ్‌ డేగా నిర్వహిస్తున్నాం. ఇళ్లు పూర్తయ్యే సరికి మూడు రకాల మౌలిక సదుపాయాలు (విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ) తప్పనిసరిగా ఉండాలి. మిగిలిన మౌలిక సదుపాయాలనూ వృద్ధిచేసుకుంటూ ముందుకు సాగాలి. ని అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. ప్రాధాన్యత క్రమంలో లే అవుట్ల వారీగా పనులు గుర్తించాలన్న సీఎం.. విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ తప్పనిసరిగా ఉండాలి.

– వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

మరోవైపు.. వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో పార్టీ రీజనల్‌ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులను ప్రకటించారు. వైసీపీ అనుబంధ విభాగాల కో ఆర్డినేటర్‌గా పార్టీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమించారు. పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్, ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి సహాయకులుగా చెవిరెడ్డి వ్యవహరిస్తారని పార్టీ కార్యాలయం వెల్లడించింది. రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షుల జాబితాను కూడా వైసీపీ కార్యాలయం విడుదల చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ