CM Jagan: భూం భూం.. గవర్నర్ చాయిస్.. ఇవన్నీ చంద్రబాబు బ్రాండ్లే.. అసెంబ్లీలో సీఎం జగన్ వ్యంగ్యాస్త్రాలు..
నవరత్నాలు మా బ్రాండ్స్ అయితే మద్యం బ్రాండ్లన్నీ చంద్రబాబువేనని సీఎం జగన్ ఎద్దేవ చేశారు. చంద్ర బాబు ప్రభుత్వ హయాంలోనే ఎన్నో మద్యం బ్రాండ్లను అనుమతి ఇచ్చారని సీఎం జగన్ గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మద్యం పాలసీపై రసవత్తర చర్చ జరిగింది. ఇదే అంశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(CM YS Jagan Mohan Reddy) పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జంగారెడ్డిగూడెం మరణాలపై ప్రతి పక్షనాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ఏపీలో దొరుకుతున్న లిక్కర్ బ్రాండ్లన్నీ టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలోనివేనని సీఎం సీఎం వివరించారు. నవరత్నాలు మా బ్రాండ్స్ అయితే మద్యం బ్రాండ్లన్నీ చంద్రబాబువేనని సీఎం జగన్ ఎద్దేవ చేశారు. చంద్ర బాబు ప్రభుత్వ హయాంలోనే ఎన్నో మద్యం బ్రాండ్లను అనుమతి ఇచ్చారని సీఎం జగన్ గుర్తు చేశారు. ఆ బ్రాండ్లను మేం క్రియేట్ చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో 254 కొత్త బ్రాండ్లు వచ్చాయని సీఎం తెలిపారు. భూం భూం, గవర్న్ చాయిస్, పవర్‌స్టార్ 999, ప్రెసిడెంట్ మెడల్, హెవెన్స్ డోర్, క్లిప్ హ్యాంగర్, 999 లెజెండ్, రష్యన్ రోమానోవా ఇలాంటి వన్నీ చంద్రబాబు బ్రాండ్లని ఆయన ఎద్దేవే చేశారు.
ఈ బ్రాండ్ల పేర్లు వింటే నాకే ఆశ్చర్యం వేస్తోందన్నారు. ప్రతి ఒక్క బ్రాండ్ బాబు హయాంలోనే వచ్చాయన్నారు. 2014-2019 వరకు ఏడు డిస్టలరీలకు అనుమతి ఇచ్చారని జగన్ తెలిపారు. అందుకే ఆయన ఇంటి పేరు నారా బదులు సారా అంటే సరిపోతుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వంలో కొత్తగా ఒక్క డిస్టలరీకి కూడా అనుమతి ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో 20 డిస్టలరీలు ఉంటే 1982కి ముందు ఉన్నవి కేవలం ఐదేనని జగన్ పేర్కొన్నారు.
అయితే వైఎస్‌ఆర్ చేయూత, ఆసరా, అమ్మఒడి, జగనన్న దీవెన, దిశ వంటి బ్రాండ్లను తమ హయాంలో తీసుకొచ్చామని అన్నారు. చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా మహిళలకు రాజకీయ పదవులు ఇచ్చామన్నారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలను బాబు నిలువునా ముంచారని విమర్శించారు. అక్కచెల్లెమ్మలకు మంచి చేసే ఏ స్కీమ్ బాబు పెట్టలేదన్నారు. మంచి చేసే ప్రయత్నం ఏ రోజూ చేయలేదని.. జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా మరణాలనీ, చీఫ్ లిక్కర్ అమ్ముతున్నారనీ.. వినని పేరుతో బ్రాండ్లు వచ్చాయని ప్రచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి: Egg Storing Hacks: వేసవిలో గుడ్లు తొందరగా పాడవుతున్నాయా..? ఎక్కువ రోజులు ఎలా నిల్వ చేయాలో తెలుసా..
Coconut Water: వేసవికాలంలో కొబ్బరి నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో తెలుసా..