Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: తాడికొండ తగాదా మళ్లీ మొదటికొచ్చింది.. ఎమ్మెల్యే శ్రీదేవి, ఎమ్మెల్సీ డొక్కా మధ్య కొత్త ఫైట్..

తాడికొండ తగాదా మళ్లీ మొదటికొచ్చింది. ఫిరంగిపురం వేదికగా ఎమ్మెల్యే శ్రీదేవి, ఎమ్మెల్సీ డొక్కా మధ్య కొత్త ఫైట్‌ మొదలైంది. తాడికొండ వైసీపీలో మళ్లీ చిచ్చు రాజుకుంది.

Andhra Pradesh: తాడికొండ తగాదా మళ్లీ మొదటికొచ్చింది.. ఎమ్మెల్యే శ్రీదేవి, ఎమ్మెల్సీ డొక్కా మధ్య కొత్త ఫైట్..
Mla Sridevi Vs Mlc Manikya Varaprasad
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 27, 2022 | 10:31 AM

తాడికొండ తగాదా మళ్లీ మొదటికొచ్చింది. ఫిరంగిపురం వేదికగా ఎమ్మెల్యే శ్రీదేవి, ఎమ్మెల్సీ డొక్కా మధ్య కొత్త ఫైట్‌ మొదలైంది. తాడికొండ వైసీపీలో మళ్లీ చిచ్చు రాజుకుంది. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ మధ్య కొనసాగుతోన్న ఆధిపత్య పోరు మరోసారి రచ్చకెక్కింది. తాడికొండ వైసీపీ సమన్వయకర్తగా డొక్కాను నియమించడంతో మొదలైన యుద్ధం, ఇప్పుడు మరింత తారాస్థాయికి చేరింది. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలను డొక్కాకు అప్పగించడంతో రగిలిపోతోంది శ్రీదేవి వర్గం. తాజా నియామకంతో ఎమ్మెల్యే శ్రీదేవి, ఎమ్మెల్సీ డొక్కా మధ్య అగాధం మరింత పెరిగింది.

ఫిరంగిపురం మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో అది స్పష్టంగా కనిపించింది. రెండు వర్గాలుగా విడిపోయారు ఫిరంగిపురం మండల వైసీపీ నేతలు. దాంతో, సర్వసభ్య సమావేశం హైటెన్షన్‌ పుట్టించింది. ఎమ్మెల్యే శ్రీదేవి, ఎమ్మెల్సీ డొక్కా వర్గాల ఆధిపత్య పోరుతో ఫిరంగిపురంలో బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మండల పరిషత్‌ సమావేశంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.

ఎమ్మెల్యే శ్రీదేవి, ఎమ్మెల్సీ డొక్కా మధ్య కొన్నాళ్లుగా యుద్ధం జరుగుతోంది. దాంతో, తాడికొండ వైసీపీలో రెండు వర్గాలుగా విడిపోయారు నేతలు, కార్యకర్తలు. పోటాపోటీ ఆందోళనలు, ప్రెస్‌మీట్స్‌తో హీట్‌ పుట్టించాయి ఇరువర్గాలు. నియోజకవర్గమంతటా ఈ ఫైటింగ్‌ కొనసాగుతోంది. కేవలం, ఆందోళనలే కాదు కొట్టుకునేవరకూ వెళ్తున్నాయ్‌ ఇరువర్గాలు. దాంతో, తాడికొండ వైసీపీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. ఎప్పుడేం జరుగుతాయో తెలియని పరిస్థితులు నెలకొన్నాయ్‌ ఆ నియోజకవర్గ వైసీపీలో.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..